Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ జ‌నాల్ని ఇంత‌ పచ్చిగా తిట్టేశారేం?

By:  Tupaki Desk   |   25 Oct 2021 10:30 AM GMT
ఇండ‌స్ట్రీ జ‌నాల్ని ఇంత‌ పచ్చిగా తిట్టేశారేం?
X
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మకు పెద్ద దిక్కు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ని కోల్పోయిన నాటి నుంచి వేరొక పెద్ద‌ ఎవ‌రు? అన్న దానిపై ఎప్ప‌టిక‌ప్పుడు డిబేట్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. దాస‌రి త‌ర్వాత ఆయ‌న స్థానంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద అవుతారా? అన్న మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు హీటెక్కించాయి. అయితే దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌దైన శైలిలో స్పందించి అన్న‌య్య ఎందుకు ఆ పాత్ర పోషిస్తారు? అన్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత ఇదే ప్ర‌శ్న ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు ముందుకు వెళ్ల‌గా ఇక్క‌డ ఎవడూ ఎవ‌డి మాటా విన‌రు. మ‌న ఇంట్లో పిల్ల‌లే మ‌న మాట విన‌రు. అలాంట‌ప్పుడు బ‌య‌ట వాళ్లు చెబితే ఎందుకు వింటారు? చెప్పిన వాళ్లు చుల‌క‌న అవ్వ‌డం త‌ప్ప‌! ఇంక పెద్ద‌న్న పాత్ర‌లంటూ ఏమీ ఉండ‌వ‌ని క‌రాఖండీగా చెప్పేసారు.

తాజాగా పెద్ద దిక్కుపై ప్ర‌శ్న సంచ‌ల‌నాల రామ్ గోపాల్ వ‌ర్మ ముందుకు వెళ్లింది. దీంతో వ‌ర్మ మొత్తం ప‌రిశ్ర‌మ‌నే కెలికి వ‌దిలేసారు. అస‌లు సినిమా ప‌రిశ్ర‌మ అనేది ఎప్పుడూ ఒక కుటుంబంగా ఉండ‌ద‌న్నారు. ఇక్క‌డ ఎన్ని కుటుంబాలు ఉన్నా? ఎవ‌రి బ్ర‌త‌కు వారిది? ఎవ‌రి జీవితం వారికుంటుంది. ఇక్క‌డ ఎవ‌డు ఎవ‌డి కోసం ఏదీ చేయ‌రు. అంత ఎందుకు? మ‌న హీరోలే ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. హీరోలంద‌రూ బాగుండాల‌ని ఏ హీరో కోరుకోడు. పైకి చెప్పేవ‌న్నీ బ‌డా క‌బుర్లే. ప్రాక్టిక‌ల్ గా దాన్నిచేసి చూపించ‌మ‌నండి.

ఒక‌రి ఎదుగుద‌ల‌ను ఇంకో హీరో ఎప్పుడూ ఒప్పుకోడు. ఏ ద‌ర్శ‌కుడు త‌నంత గొప్పోడు ఇంకొక‌డు కాకూడ‌ద‌నుకుంటాడు. వీళ్లే కాదు నిర్మాత‌లు..టెక్నీషియ‌న్లు అందరూ అంతే. ఇవ‌న్నీ ప‌నికిమాలిన మాట‌లు..టైమ్ వేస్ట్ ప‌నులు త‌ప్ప ఏం ఒర‌గ‌ద‌ని వ‌ర్మ న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పేసారు. అదేదో సినిమాలో బ్ర‌హ్మానందం ని ఎయిర్ పోర్ట్ ఎంక్వైరీ సీన్ లో ఎలాంటి హెల్ప్ కావాలని ఓ అమ్మాయి అడిగితే ? ఓ ప‌దివేలు అప్పుంది తీరుస్తావేంటి? అంటే నోరెళ్ల‌బెడుతుంది. ప‌రిశ్ర‌మ‌లో నిజంగా హెల్ప్ కావాల‌ని ముందుకు వెళ్తే అలాంటి సీనే క‌న‌బ‌డుతుంది అన్న త‌ర‌హాలో వ‌ర్మ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.