Begin typing your search above and press return to search.
రంగీలా @25.. అమీర్ ఖాన్ తో ఆర్జీవీ మెమరీస్
By: Tupaki Desk | 8 Sep 2020 5:33 PM GMTఏటికి ఎదురీదడం .. రొటీనిటీకి దూరంగా ఆలోచించడం .. క్రియేటర్లకే క్రియేటర్ అనిపించుకోవడం ఇవన్నీ ఆర్జీవీకే చెల్లిన విద్యలు. ప్రచారార్భాటంలో వర్మను కొట్టేవాళ్లే లేరు. వివాదంతో ప్రచారం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏది ఏమైనా.. ఆర్జీవీ లాంటి మరో దర్శకుడిని చూడడం ఈ ఇండస్ట్రీలో అసంభవం.
ఆయన క్లాసిక్ డేస్ మెమరీస్ లోకి వెళితే.. నాటి రోజుల్ని అస్సలు మర్చిపోలేం. ముఖ్యంగా రంగీలా డేస్ ని ఎవరూ మర్చిపోలేరు. ఊర్మిల మటోండ్కర్ లాంటి గొప్ప ట్యాలెంటును బయటి ప్రపంచానికి ఆవిష్కరించిన గొప్ప ఘనత ఆర్జీవీకే చెందుతుంది. ఇదే సినిమాతో అమీర్ ఖాన్.. జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ల ప్రభ వెలిగిపోయింది. ఆ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీపడి నటించేంత గొప్ప స్క్రిప్టును తీర్చిదిద్దారు ఆర్జీవీ. ఇక ఈ మూవీలో యాయిరే యాయిరే సాంగ్ అయితే దశాబ్ధం పాటు ఓ ఊపు ఊపింది.
ఆ సమయంలో నా సహాయకుడు అంటూ ఒకరిని.. నా కుడి వైపున.. నేను నీలిరంగు టోపీలో.. డాప్ డబ్ల్యు బి రావు టోపీ ధరించి.. నటుడు రాజేష్ జోషి ఎరుపు రంగులో.. అలాగే అమీర్ ఖాన్ అంటూ ఓ ఫోటోని షేర్ చేశాడు ఆర్జీవీ.
25 సంవత్సరాల రంగీలా ... దర్శకుడు రాము ఈ మ్యూజికల్ డ్రామా మూవీతో ఎప్పటికీ బి ‑ టౌన్ లో చరిత్ర సృష్టించాడు. నిజంగా ఒక ఐకానిక్ మూవీ !! ...అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్రం 25 వ సంవత్సరం చూసింది. సాక్ష్యమిచ్చే ఫోటో ఇది. ఉర్మిలా పనితీరును కేవలం మాటల్లోనే ప్రశంసించలేరు. ఆమె అందం వర్ణించలేనిది. షో బిజినెస్ గురించి కథ.. ముక్కోణ ప్రేమకథ. ఇది మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కూడా. ఆర్జీవీ మాస్టర్.. అంటూ పొగిడేశాడో ఫ్యాన్. ఇంకా ఇంకా సోషల్ మీడియాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆయన క్లాసిక్ డేస్ మెమరీస్ లోకి వెళితే.. నాటి రోజుల్ని అస్సలు మర్చిపోలేం. ముఖ్యంగా రంగీలా డేస్ ని ఎవరూ మర్చిపోలేరు. ఊర్మిల మటోండ్కర్ లాంటి గొప్ప ట్యాలెంటును బయటి ప్రపంచానికి ఆవిష్కరించిన గొప్ప ఘనత ఆర్జీవీకే చెందుతుంది. ఇదే సినిమాతో అమీర్ ఖాన్.. జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ల ప్రభ వెలిగిపోయింది. ఆ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీపడి నటించేంత గొప్ప స్క్రిప్టును తీర్చిదిద్దారు ఆర్జీవీ. ఇక ఈ మూవీలో యాయిరే యాయిరే సాంగ్ అయితే దశాబ్ధం పాటు ఓ ఊపు ఊపింది.
రంగీలా రిలీజై 25 సంవత్సరాలైంది నేటితో. ఈ అరుదైన సందర్భాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అమీర్ ఖాన్ తో మెమరీస్ ని గుర్తు చేసుకున్నారు ఆర్జీవీ. నాటి సెట్లో అరుదైన ఓ ఫోటోని షేర్ చేశారు.