Begin typing your search above and press return to search.
జింతాత మొదలు పెట్టిన ఆర్జీవి
By: Tupaki Desk | 8 Aug 2019 10:45 AM GMTమొన్నటివరకూ ఇస్మార్ట్ వేడుకల్లో మునిగితేలి.. బీరు స్నానాలు చేసి అభిమానులను.. లిక్కర్ బాబులను ఉర్రూతలూగించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రమోషన్ మోడ్ లోకి వచ్చాడు. గత కొన్ని రోజులుగా తన సినిమా విషయాలేవి పంచుకోకపోవడంతో 'ఏం జరిగిందా? అర్జీవీ ఎందుకు మౌనంగా ఉన్నాడు' అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. వారికి ఉత్సాహాన్నిస్తూ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు.
వర్మ కొన్ని రోజుల క్రితం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా "ది మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిలిం 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా ఫస్ట్ సాంగ్ ట్రైలర్ రేపు శుక్రవారం 9 వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ అవుతుంది" అని ప్రకటించాడు. మరో ట్వీట్ లో "కమ్మరాజ్యంలో కడప రెడ్లు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి.. భవిష్యత్తుకు సంబంధించిన కథ. ఇది నిజంగాఅసలు వివాదాస్పదం కాని కథ.. చంద్రబాబు నాయుడు పై ఒట్టు. రేపు 9 గంటలకు సాంగ్ ట్రైలర్ రిలీజ్" అంటూ జింతాత మొదలు పెట్టాడు.
టైటిలే వివాదాస్పదంగా ఉందని టైటిల్ ను ప్రకటించిన రోజు నుండి కామెంట్లు వినిపించాయి. అయితే గురుడేమో మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిలిం అంటున్నాడు. మరి ఫస్ట్ సాంగ్ లిరిక్స్ చూస్తేనే వివాదం ఉందో లేదో అర్థం అవుతుంది. అయినా వివాదం లేని వర్మ సినిమా.. మసాలా లేని బిర్యాని రెండు ఒకటే ఏం తేడా ఉండదు! అయినా దేవుడిని నమ్మను దేవతలను నమ్మను అంటాడు.. వరలక్ష్మీ వ్రతం రోజు ముహూర్తం పెట్టుకున్నాడు. ఈ వర్మ ఆ డోనాల్డ్ ట్రంప్ కు తప్ప ఎవరికీ అర్థం అయ్యేలా లేడు.