Begin typing your search above and press return to search.

హై కోర్టు..సుప్రీం కోర్టు డిలేస్ తో అలసిపోయా: ఆర్జీవీ

By:  Tupaki Desk   |   5 April 2019 8:31 AM GMT
హై కోర్టు..సుప్రీం కోర్టు డిలేస్ తో అలసిపోయా: ఆర్జీవీ
X
సహజంగా ఎలెక్షన్ సీజన్ లో సినిమాల టాపిక్ వెనక్కు వెళ్ళిపోతుంది. ప్రతి నిముషం అసలు ఊహించని ట్విస్టులు ఉండే ఎలెక్షన్ సీజన్లో.. ఏమాత్రం ట్విస్టులు ఉండని రొటీన్ సినిమాలపై ప్రేక్షకులైనా ఎందుకు ఆసక్తి చూపిస్తారు? కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా రామ్ గోపాల్ వర్మ అందరి దృష్టిని తనవైపుకు తన సినిమావైపుకు తిప్పుకున్నాడు.. ఒక నెల నుంచి.. ఇంకా చెప్తే డిసెంబర్ నుంచి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను అనుకూలురు.. వ్యతిరేకులు ఇద్దరూ చాలా శ్రద్ధగా ఫాలో అవుతున్నారు.

'అ ఒక్కటి తక్క..' అనే పాత సినిమా ఫేమస్ డైలాగ్ లాగా 'ఆంధ్రప్రదేశ్ లో తప్ప' ప్రపంచం అంతటా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ అయింది. దీంతో సహజంగానే రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా అప్సెట్ అయ్యాడు. ట్విట్టర్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఏప్రిల్ మూడవ తేదీన తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఏపీలో ఉన్న మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కావడంలో జాప్యం కారణంగా కోపంగా ఉన్నారా.. బాధపడుతున్నారా?" అంటూ ఒక పోల్ నిర్వహించాడు. ఈ పోల్ కు 76% నెటిజనులు 'అవును' అని వోట్ వేయగా.. 24% మంది నెటిజనులు 'కాదు' అని తమ స్పందన తెలిపారు. ఇక కొందరు నెటిజనులు తమ కామెంట్స్ లో మేము ఏపీలో లేమని అయినా ఏపీలో విడుదల కానందుకు బాధ పడుతున్నామని చెప్పారు.

ఈ పోల్ సంగతి ఇలా ఉంటే ప్రసన్న వర్మ అనే పెయింటర్ వేసిన రెండు పెయింటింగ్ లను తన తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు ఆర్జీవీ. ఒక పెయింటింగ్ లో కోతి మెడకు సంకెళ్ళు వేసి ఉన్నాయి. దీనికి "నేను ఈ హైకోర్టు.. సుప్రీం కోర్టుల ఆలస్యంతో తీవ్రంగా అలసిపోయాను" అనే కామెంట్ పెట్టాడు. మరో పెయింటింగ్ లో తల్లి కోతి గాయాలు తగిలిన పిల్లకోతిని అక్కున చేర్చుకొని ఓదారుస్తూ ఉంది. దీనికి క్యాప్షన్ గా "'అమ్మ' అర్జీవీ.. బిడ్డ 'లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఓదారుస్తూ ఉందని చెప్తూ పెయింటర్ ను ఒక 'విజనరీ' అంటూ ఆకాశానికెత్తేశాడు.