Begin typing your search above and press return to search.
కరోనా 'వైరస్' గురించి నేను రెండేళ్ల క్రితమే చెప్పా : ఆర్జీవీ
By: Tupaki Desk | 3 April 2020 5:00 PM GMTకరోనా నేపథ్యంలో డైలీ లైవ్ అప్డేట్ ఇస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఈసారి సరికొత్తగా బ్రహ్మంగారిలా కాలజ్ఞానం తెలిసిన వాడిలా ట్వీట్ చేసాడు. 'వైరస్' నేపథ్యంలో రెండేళ్ల క్రితమే సినిమా తీయబోతున్నానని ప్రకటించానని ట్వీట్ చేసాడు. వాస్తవానికి 'వైరస్' అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రెండేళ్ల క్రితమే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'సర్కార్', '26/11 ది ఎటాక్' చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వర్మ 10/6/2018 లో ట్వీట్ చేశారు. పూర్తి వివరాల ప్రకటన కోసం ఫేస్‌బుక్ లింక్‌ను కూడా షేర్ చేశారు. ఎబోలా కంటే భయంకరమైన వైరస్ ముంబయి నగరాన్ని వణికించే కథాంశం తో సినిమా తీయబోతున్నట్లు ఆయన ప్రకటనలో చెప్పారు.
'ఆఫ్రికా పర్యటనకు వెళ్లి ముంబయి వచ్చిన ఓ యువకుడి ద్వారా వైరస్ అందరికీ సోకుతుంది. ఊహించని ఈ పరిణామం తో ప్రభుత్వం కోట్లాది ప్రజలున్న ముంబయిలో ఒకరి నుంచి మరొకరు 20 అడుగుల దూరం ఉండాలని సూచిస్తుంది. ఆపై వైరస్ విపరీతంగా వ్యాపించి, లక్ష మందికిపైగా మృతి చెందుతారు. ఈ నగరం నుంచి రాకపోకల్ని నిషేధిస్తారు. భయబ్రాంతులకు గురైన ముంబయి వాసులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఎవరు ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తారో అన్న భయం తో.. పారిపోయే వారిని కాల్చి చంపేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ కథకు భయం, ప్రేమ, ఉత్కంఠ, త్యాగం, ఆశల్ని మేళవించి హ్యూమన్ డ్రామాగా సినిమా రూపొందించబోతున్నాం' అని వర్మ రెండేళ్ల క్రితం వెల్లడించారు.
ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న నేపథ్యంలో ఆ విషయాన్ని వర్మ గుర్తు చేసుకున్నారు. 'మహమ్మారి వైరస్‌పై స్క్రిప్టు రాశానని, సినిమా తీస్తానని 10/6/2018లో చెప్పా. ఇవాళ జరుగుతున్న పరిణామాలకు నా కథ ఎంత దగ్గరగా ఉందో చూడండి. రెండేళ్ల క్రితం నేను చేసిన ట్వీట్ ఇది' అని ఆయన పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ఆర్జీవీని దేవుడి తో పోల్చగా, మరికొందరు కాలజ్ఞాని తో పోలుస్తున్నారు.