Begin typing your search above and press return to search.

ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడాలని వర్మ డిమాండ్

By:  Tupaki Desk   |   22 May 2021 8:42 AM GMT
ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడాలని వర్మ డిమాండ్
X
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆయుర్వేదం ఆనందయ్యపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లతో విరుచుకుపడ్డాడు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుతో కరోనా తగ్గుతుండడంతో దీనిపై ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్ ప్రస్తుతం పరిశోధన సాగిస్తున్నాయి. అయితే ఆకులు, అలములతో కరోనాను తగ్గిస్తున్న ఆనందయ్య మందుపై వర్మ తనదైన శైలితో కౌంటర్లు ట్విట్టర్లో సంధించారు.

దేశంలో జరిగే ప్రతి సందర్భాన్ని వాడుకొని రచ్చ చేసే రాంగోపాల్ వర్మ తాజాగా ఏపీలో కరోనా మందు తయారు చేసిన ఆనందయ్యపై పడ్డాడు. వరుస ట్వీట్లు చేశాడు. వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు.

వర్మ ట్వీట్ చేస్తూ 'ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, అంటువ్యాధుల శాస్త్రవేత్త ఫౌచీ బయలు దేరి కృష్ణపట్నం వస్తున్నారని.. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికి అయ్యిండొచ్చు అని.. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని వర్మ ట్వీట్ చేశాడు. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి సైనిక భద్రత కల్పించవచ్చు కదా అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇక వర్మ మరో ట్వీట్ చేశారు. 'దేశంలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ లకు ఇచ్చే నిధులను ఆనందయ్యకు పంపించాలా? జస్ట్ ఆస్కింగ్' అంటూ మరో ట్వీట్ వేశాడు వర్మ. ప్రభుత్వం ఇక ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్ల గురించి ఆలోచించడం మానేసి.. ఆనందయ్యకు తేనె, వేపాకు పేస్ట్, గడ్డి, ఉల్లిపాయలు పంపిణీ చేయాలని ఆలోచించాలంటూ వర్మ తనదైన శైలిలో ప్రభుత్వానికి సెటైర్లు వేశారు.

ఇక ఫైజర్, మోడెర్నా లాంటి కంపెనీలు తమ ఫార్ములాను ఎవరికీ ఇవ్వడం లేదని.. అలాంటి సమయంలో ఉచితంగా కరోనా మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యకు 'నోబెల్ బహుమతి' ఇవ్వాలని వర్మ డిమాండ్ చేయడం విశేషం.

ఇక మరో సెటైర్ సంధించాడు వర్మ.. 'కళ్లలో చుక్కల మందు వేసుకుంటే ఊపిరితిత్తుల సమస్య ఎలా తగ్గుతుంది ఆనందయ్య గారు.. నోరు ముక్కు, చెవి గురించి నాకు తెలుసు' అని వర్మ కౌంటర్ వేశాడు.ఇలా ఆనందయ్య వ్యవహారం ఏపీలో వైరల్ అయిన వేళ ప్రపంచవ్యాప్తంగా పరిణామాలపై వర్మ సెటైర్ల వర్షం కురిపించారు. అవిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.