Begin typing your search above and press return to search.
మోడీషా, అధికారులను కడిగేసిన వర్మకు జైహో
By: Tupaki Desk | 1 May 2021 4:50 AM GMTవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మలోనూ సామాజిక సృహ అన్యాయాలపై నిగ్గదీసి అడిగే గుణం వచ్చేసింది. కరోనా పుణ్యమాని ఆయన కూడా కాస్త గట్టిగానే అన్యాయాలపై ప్రశ్నిస్తుండడం విశేషం. వివాదాలను కెలికి మరీ రాజేసే వర్మకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఏదోఒకటి కెలకనిదే ఆయన నిద్ర పోడు. మరొకటి గురించి తెల్లారి లేస్తే చాలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ చర్చ పెడుతుంటాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి అతను ఎల్లప్పుడూ దృష్టి పెడతాడు.
ఒకప్పుడు వర్మ చాలా మేధోపరమైన రీతిలో మాట్లాడేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చుతుండడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. సీరియస్ అంశాలపై వ్యాక్యానిస్తూ కాకపుట్టిస్తున్నారు.
ఏదేమైనా ఈ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చాలా కాలం తరువాత మొదటిసారి రాజకీయ నాయకులు, అధికారులపై ఘాటు ట్వీట్లు చేసి ఎండగట్టారు. ఇటీవల త్రిపురలో పెళ్లి చేసుకున్న జంటను కలెక్టర్ , పోలీసులు వెళ్లి అడ్డుకొని వారిని కొట్టి అరెస్ట్ చేయడం దుమారం రేపింది. వివాహాలలో గుమిగూడిన ప్రజలను పోలీసులు, అధికారులు కొడుతున్నారని ఆర్జీవీ తన ట్వీట్‌లో ఎత్తిచూపారు,
మరి సాధారణ ప్రజలను కొడుతున్న ఇదే పోలీసులు, అధికారులు కుంభమేళాలో సామూహికంగా వందలమంది సాధువులను అనుమతించినందుకు పోలీసులు, ప్రభుత్వ అధికారులను ప్రజలు కొడితే ఫర్వాలేదా అని వర్మ కడిగిపారేశాడు..
రెండో వేవ్ రావడానికి కుంభమేళా సహా ఎన్నికల నిర్వహణనే కారణమని అందరూ ఇప్పటికే విమర్శిస్తున్నారు. ఇంతటి ఉపద్రవంలో ఈ నెల ప్రారంభంలో కుంభమేళా నిర్వహణకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ప్రజలు ఏం చేయాలని వర్మ నిలదీశారు. వారు స్వయంగా భారీ ర్యాలీలలో పాల్గొని, కరోనావైరస్ గురించి పూర్తిగా మరచిపోయినందున ప్రజలు ఎలా బుద్దిచెప్పాలని ఆర్జీవీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని, హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేసి మరీ చాలా విమర్శలు వర్మ చేయడం విశేషం.
వర్మ మాటలు నిజంగానే మోడీషా, అధికారుల తప్పులు ఎత్తిచూసి సెంటిమెంట్‌ను రాజేశాయి. చాలా మంది నెటిజన్లు వర్మ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు, చాలా కాలం తరువాత మొదటిసారిగా వర్మకు సపోర్టుగా సోషల్ మీడియాలో షేర్లు, కామెంట్లు వస్తున్నాయి..

Thanks to our man’s dadagiri the young couple will now remember their marriage day as the most humiliated day of their life pic.twitter.com/Acx8Ya7ZEk
— Ram Gopal Varma (@RGVzoomin) April 30, 2021