Begin typing your search above and press return to search.
మహిళలకు మంట పుట్టేలా వర్మ ట్వీట్
By: Tupaki Desk | 8 March 2021 5:30 AM GMTతన మాటలతో.. సోషల్ మీడియాలో చేసే పోస్టులతో తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా మరోసారి తన మార్కును చూపించారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని సంబరంగా నిర్వహించుకుంటున్న వేళ.. ఆయన తనదైన శైలిలో ఒక పోస్టు పెట్టారు.
గడిచిన కొద్దికాలంగా వార్తల్లో పెద్దగా కనిపించని ఆర్జీవీ.. రీసెంట్ గా హైదరాబాద్ మేయర్ మీద పెట్టిన వీడియోతో వార్తల్లోకి వచ్చారు. చూస్తుంటే.. ఆయన చేసిన తాజాగా సినిమా పూర్తిఅయినట్లుంది. తన సినిమా విడుదలకు కాస్త ముందు నుంచి నిత్యం వార్తల్లో ఉండి.. తనకు తోచింది చెబుతూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిపురస్కరించుకొని ఆయన ఒక ట్వీట్ చేశారు.
అందులో తానీ రోజున మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలుచెప్పనని పేర్కొన్నారు. ఎందుకంటే.. మహిళలుప్రతి రోజు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటానని.. అందుకే వారికి తాను ఉమెన్స్ డే విషెస్ చెప్పనని చెప్పారు. ఇలాంటి చావు తెలివితేటలు వర్మ దగ్గర టన్నుల కొద్దీ ఉంటాయని కొందరు తప్పు పడుతుంటే.. మరికొందరు మాత్రం.. నిజమే కదా.. ఆయన చెప్పిన దాన్లోనూ లాజిక్ ఉంది కదా అంటూ సపోర్టు చేస్తున్నారు. నిజంగానే విషెస్ చేయటం ఇష్టం లేకపోతే.. మౌనంగా ఉండొచ్చు కదా? అలా కాకుండా.. తన మనసులోని మాట చెప్పేసి రచ్చ చేసేయటం ఏమిటో? ఏమైనా.. తన పోస్టుతో తన చుట్టూ చర్చ జరిగేలా చేయటమే కదా.. వర్మ ప్రత్యేకత. కాదంటారా?