Begin typing your search above and press return to search.

ఉగాది ప‌చ్చ‌డి కావాలా? ఒళ్లంతా ప‌చ్చ‌డి కావాలా?

By:  Tupaki Desk   |   24 March 2020 2:22 PM GMT
ఉగాది ప‌చ్చ‌డి కావాలా? ఒళ్లంతా ప‌చ్చ‌డి కావాలా?
X
టైమ్ చూసి టైమింగుతో పంచ్ లు విస‌ర‌డంలో ఆర్జీవీ త‌ర్వాత‌నే. ఆయ‌న టైమింగే వేరు. ఇదిగో ప్ర‌స్తుతం కోవిడ్ 19 వ‌ల్ల అత‌లాకుత‌లం అవుతున్న తెలుగు రాష్ట్రాల స‌న్నివేశాన్ని ఆయ‌న రెండే రెండు వాక్యాల్లో చెప్పేశారు. "ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి.. ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి -పోలీసు హెచ్చరిక" అంటూ ఆర్జీవీ ట్విట్ట‌ర్ లో అదిరే స్టైల్లో చెప్పారు. ఇక‌పోతే ప్ర‌తిసారీ వ‌క్రంగానో వ్యంగ్యంగానో పంచ్ లు వేసే ఆర్జీవీ ఇంత పాజిటివ్ గా పోలీసుల‌కు స‌పోర్టుగా నిలిచారంటే ఏదో జ‌ర‌గ‌బోతోంద‌నే దీన‌ర్థం.

క‌రోనా వైరస్ ప్ర‌భావానికి ఆయ‌న కూడా భ‌య‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే కాస్త బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వెకిలి కామెంట్లు ఏవీ చేయ‌డం లేదు. జ‌నాల‌పై సెటైర్ తో కూడిన వ్యాఖ్యానం మాత్ర‌మే చేశారు. ఇక వేరొక ట్వీట్ లో ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వైద్యురాలు ఆ మాస్క్ లు ఓపెన్ చేసిన ఫోటోల్ని షేర్ చేశారు. అంటే గంట‌ల కొద్దీ స‌మ‌యం అలా మాస్కులు వేసుకుని వైద్యం చేయ‌డం వ‌ల్ల ఆ డాక్ట‌ర్ ముఖం ఎర్ర‌గా కంద‌గ‌డ్డ‌లా కందిపోయి క‌నిపించింది. ఎక్క‌డికక్క‌డ మాస్క్ ఎర్ర‌గా కోసేసిందంతే.

ఇక రోడ్ల‌పైకి వెళితే తెలుగు రాష్ట్రాల్లో స‌న్నివేశం ఎలా ఉందో టీవీల్లో చూస్తూనే ఉన్నారు క‌దా? ఆర్జీవీనే సీనేంటో చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోడ్ల‌పై దొరికితే ప‌చ్చ‌డి ప‌చ్చ‌డి చేసేస్తూ పోలీసులు వీరంగం వేయ‌డం క‌నిపిస్తూనే ఉంది. పాపం అందులో యూత్ కాలేజ్ బోయ్స్ అనే తేడాలేం లేవ్. రోడ్ల‌పై దొరికిన‌వాళ్లంద‌రినీ ఉతికి ఆరేస్తున్నారు. ఇదంతా స‌రేకానీ ఆర్జీవీ గారూ.. ఇంత‌కీ చైనాలో రిలీజ్ చేస్తాన‌న్న ఎంట‌ర్ ది లేడీ డ్రాగ‌న్ సినిమా ఏమైందండీ? రిలీజ‌వుతుందంటారా? మీకు మీరు స్వీయ‌నిర్భంధ‌నంలో ఉంటే ఎలా? ఆ సినిమా పూర్తి చేసి చైనాలో ఇండియాలో రిలీజ్ చేయ‌రా?