Begin typing your search above and press return to search.

గరికపాటి Vs చిరంజీవి: మెగాస్టార్ కు వీరాభిమానిగా ఆర్జీవీ ట్వీట్స్..!

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:00 AM GMT
గరికపాటి Vs చిరంజీవి: మెగాస్టార్ కు వీరాభిమానిగా ఆర్జీవీ ట్వీట్స్..!
X
మెగాస్టార్ చిరంజీవి పై ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దసరా పండుగ తర్వాత రోజు హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం వేదికగా చోటుచేసుకున్న ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గరికపాటి ని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యాడు.

గరికపాటి వెర్సెస్ చిరంజీవి ఇష్యూలోకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో ట్వీట్లతో ట్విట్టర్ ని హోరెత్తిస్తున్నాడు ఆర్జీవీ. తనని తాను మెగాస్టార్ కు డైహార్డ్ ఫ్యాన్ గా ప్రకటించుకుంటూ రెచ్చిపోయాడు. గరికపాటి నరసింహారావు ను గట్టి పరకతో.. చిరంజీవి ని ఏనుగుతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నాడు. ఎప్పటిలాగే ఈ ట్వీట్లు ఎవరి కోసం పెడుతున్నారో ఆలోచించలేని విధంగా నెటిజన్లను గందరగోళానికి గురి చేస్తున్నాడు.

చిరంజీవి పై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత.. మెగా బ్రదర్ నాగబాబు 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ కి రియాక్ట్ అయ్యడంతో రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రతీ ట్వీట్ కు చిరంజీవి మరియు నాగబాబు లను ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ వార్ చేసాడు.

'గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అని వుంటారు.. మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రిక్వెస్ట్' అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కు ఆర్జీవీ స్పందిస్తూ.. ''ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవి ని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం *తగ్గేదెలె...*'' అని ట్వీట్ చేసాడు.

''హే గారికపీటి.. బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో. అంతేకాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి.. నువ్వే తెలుసుకో'' అని వర్మ ట్వీట్ లో పేర్కొన్నాడు. అలానే ''హే గూగురుపాటి నరసింహ రావు.. తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి'' అని మరో ట్వీట్ వదిలాడు.

''సర్ నాగబాబు గారు.. మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి.. దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ''నాగబాబు గారు.. ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే.., అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్.. సర్ సర్ సర్ చిరంజీవి ????'' అంటూ ప్రశ్నించారు.

నిజానికి మెగా హీరోలు మరియు మెగా ఫ్యామిలీని సోషల్ మీడియాలో టార్గెట్ చేసే వారిలో ఆర్జీవీ ఒకరు. గతంలో అనేక సందర్భాల్లో వారిని ఉద్దేశిస్తూ వర్మ సెటైరికల్ కామెంట్స్ - ట్వీట్స్ చేయడం మనం చూశాం. చిరంజీవి - పవన్ కళ్యాణ్ - నాగబాబు లపై ప్రత్యక్ష పరోక్ష ట్వీట్స్ చేస్తూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఎప్పుడూ మెగా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని ఏదో రకంగా గిల్లుతూ మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి ఆనందించే రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు ఉన్నట్టుండి చిరంజీవి కి సపోర్ట్ గా ట్వీట్లు పెట్టడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అభిమానులు గందరగోళంలో ఉన్నారు. అంతేకాదు తనని మెగాస్టార్ కి పెద్ద ఫ్యాన్ గా ప్రస్తావించుకోవడంతో.. ఈ ట్వీట్లు వ్యగ్యంగా వేస్తున్నారేమో అని సందేహిస్తున్నారు. గరికపాటి పై ఫైర్ అవుతున్నట్లు ఆర్జీవీ ట్వీట్లు ఉన్నప్పటికీ.. ఏ టైంలో ఎలా టర్న్ తీసుంటాడో అర్థంకాక మెగా ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. మరి ఆర్జీవీ గరికపాటి Vs చిరంజీవి వివాదాన్ని ఎక్కడి వరకూ తీసుకెళ్తాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.