Begin typing your search above and press return to search.
బూతుపై వర్మ చెప్పిన ట్రూతు
By: Tupaki Desk | 16 Jan 2018 11:19 AM GMTరామ్ గోపాల్ వర్మ అంతే. అందరిలా ఆయనుండడు.. అందరిలా ఆలోచించనూ ఆలోచించడు. రొటీన్ కు భిన్నంగా ట్రై చేస్తున్నామంటూనే తన సినిమాలను తానే రొటీన్ గా తీసుకుంటూ వచ్చేశాడు. ఇప్పుడు కొత్తగా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'' షార్ట్ కట్ లో GST అంటూ ఒకటి తీశాడు. ఇదేంటో ఇదెందుకు తీశాడో వర్మ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకుని దీనిని తీశానని చెప్పాడు. వర్మ చెప్పిన దాని ప్రకారం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ సినిమా కాదు షార్ట్ ఫిల్మ్ కాదు వెబ్ సిరీస్ కూడా కాదు. సెక్స్ మీద పోర్న్ స్టార్ మియా మాల్కోవా అభిప్రాయం.
GST లో మాల్కోవా నగ్నత్వంలోని అణువణువునీ ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దానని వర్మ తనకు తానే శభాష్ చెప్పేసుకున్నాడు. అంతేకాదు.. ఏకంగా మాల్కోవా ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ కన్నా గొప్పదని ఫిక్సయిపోయాడు. అలెగ్జాండర్ కత్తితో కష్టపడి యుద్ధం చేశాడు. మరి మాల్కోవా ఏం చేసిందయ్యా అంటే... అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి మానవ సమాజంపై దండెత్తిందట. తన అందమైన ముఖం.. అమాయకత్వంతో మాల్కోవా ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుందనేది వర్మ నమ్మకం. మియా మాటలు వింటే సెక్స్ లోని అన్ని అంశాలు పవిత్రంగా.. స్వచ్ఛంగా కనిపిస్తాయట. అదేమిటే పోర్న్ స్టార్ పవిత్రత గురించి మాట్లాడటం ఏమిటని ఉలిక్కిపడొచ్చు. అక్కడింకో కండిషన్ ఉంది. కళ్ళు, మెదడున్న వారికి మాత్రమే అలా కనపడతాయి.
తాను తీసిన GST గురించి వర్మ బోలెడంత గొప్పగొప్ప విషయాలు చెప్పాడు. అవన్నీ చదివాక కొత్త సందేహాలు పుట్టుకొస్తే అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే తీసిన వర్మకు తప్ప అందులో ఏముందో తెలియదు. అదేదో అద్భుతం గుట్టు విప్పినంత అబ్బురంగా ఫీలయి ఆయన రాసింది చదువుకుని అబ్బో అనుకోవాల్సిందే. ఇక్కడ చిత్రమేంటయ్యా అంటే.. GST లో మాట్లాడిందేమో పోర్న్ స్టార్.. టాపిక్కేమో హద్దుల్లేని శృంగారం గురించి... తీసిందేమో రామ్ గోపాల్ వర్మ.. చెప్పేదేమో ఫిలాసఫీ?