Begin typing your search above and press return to search.
రియా @ 2వ రోజు సీబీఐ ఎంక్వౌరీ
By: Tupaki Desk | 30 Aug 2020 4:50 AM GMTబాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సీబీఐ ముందు రెండవ రోజు విచారణకు హాజరు అయ్యింది. సుశాంత్ మృతి కేసులో ఈమె ప్రధాన నింధితురాలు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ప్రస్తుతం జరుగుతున్న ఎంక్వౌరీ పై ఉంది. మొదటి రోజు దాదాపుగా 9 గంటలు ఎంక్వౌరీ చేసిన సీబీఐ రెండవ రోజు ఏడు గంటల పాటు రియాను సీబీఐ వారు ప్రశ్నించారు. రెండవ రోజు ఎంక్వౌరీ మొత్తం డ్రగ్స్ మరియు ఇతర ముఖ్యమైన విషయాల గురించి రియాను సీబీఐ వారు ప్రశ్నించినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
రియా చక్రవర్తికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా జాతీయ మీడియాలో మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె డ్రగ్స్ డీలర్ తో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీబీఐ ఎంక్వౌరీలో రియా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సప్ స్ర్కీన్ షాట్స్ తనవే అందట. అయితే ఆ స్ర్కీన్ షాట్స్ లో వినియోగించిన కోడ్ వర్డ్ లకు మాత్రం ఆమె ఫుల్ ఫామ్ చెప్పలేదు. రియాకు డ్రగ్స్ రాకెట్ తో ఉన్న సంబంధం ఏంటీ అనే విషయాలను సీబీఐ వారు లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు.
సీబీఐ వారు మీడియాలో వస్తున్న కొన్న కథనాలు మరియు సుశాంత్ సోదరి ఇచ్చిన వివరాలను బట్టి ప్రశ్నలు తయారు చేసి ఆమె నుండి వాటికి సమాధానం రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మూడవ రోజు కూడా రియాను ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. డ్రగ్స్ విషయంలో రియా నింధితురాలు అని తేలితే వెంటనే సీబీఐ వారు ఆమెను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.