Begin typing your search above and press return to search.

నేను తప్పు చేసింది నిజమే కాని అది సుశాంత్‌ కోసమే : రియా

By:  Tupaki Desk   |   8 Sep 2020 4:30 AM GMT
నేను తప్పు చేసింది నిజమే కాని అది సుశాంత్‌ కోసమే : రియా
X
సుశాంత్‌ మృతి కేసు కాస్త ఇప్పుడు డ్రగ్స్‌ కేసుగా మారిపోయింది. రియాకు మరియు ఆమె సోదరుడు శోవిక్‌ చక్రవర్తికి డ్రగ్స్‌ రాకెట్‌ తో సంబంధం ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది. చాలా సార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేయడంతో పాటు డ్రగ్స్‌ కు సంబంధించిన ఫోన్‌ సంభాషణలు చేయడంతో ఇప్పటికే శోవిక్‌ ను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు రియా చక్రవర్తి కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె తండ్రి స్వయంగా నా కొడుకు అరెస్ట్‌ అయ్యాడు. తర్వాత అరెస్ట్‌ కాబోతున్నది నా కూతురు అనే విషయం నాకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశాడు అంటే రియా ఎంతటి ట్రబుల్స్‌ లో ఉందో చెప్పనక్కర్లేదు.

ఎన్‌ సీ బీ ఎంక్వౌరీలో రియా పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించింది. సాక్ష్యాధారాలు అన్ని కూడా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లుగా రియా ఒప్పుకుంది. అయితే తాను మాత్రం డ్రగ్స్‌ ఎప్పుడు తీసుకోలేదు. కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు అంటూ రియా పేర్కొంది. ఇదే సమయంలో తాను ఏం చేసినా కూడా సుశాంత్‌ కోసం చేశాను. అతడితో ప్రేమలో ఉన్న కారణంగా అతడి కోసం ఇలాంటి పనులు కూడా చేయాల్సి వచ్చిందని అతడికి ముందు నుండే ఈ అలవాటు ఉందని తాను మాన్పించేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు అంటూ రియా చక్రవర్తి క్లారిటీ ఇచ్చింది.

చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఎలాగూ లేరు కదా అంటూ ఇష్టానుసారంగా నేరారోపణలు చేయడం మంచిది కాదంటూ రియాను కొందరు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఈ విషయం మొత్తం కూడా రచ్చ రచ్చ అవుతున్న నేపథ్యంలో ముందు ముందు ఏం జరుగుతుందో అని రియా అరెస్ట్‌ అయితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.