Begin typing your search above and press return to search.
సుశాంత్ అకౌంట్ లోని 15 కోట్లు రియా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయా..?
By: Tupaki Desk | 29 July 2020 6:50 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఇండీస్ట్రీలోని నెపోటిజం మరియు కొందరి వ్యక్తుల వల్ల మానసిక ఒత్తిడి లోనై సుశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సుశాంత్ మరణంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదు పేజీల కంప్లైంట్ లో సుశాంత్ ను రియా సూసైడ్ కు ప్రేరేపించిందని ఆర్థికంగా మోసం చేసిందని మానసికంగా వేధించిందని ఆరోపించారు.
అంతేకాకుండా 2019 వరకు సుశాంత్ కు ఎలాంటి మెంటల్ డిప్రెషన్ లేదని.. ఒకవేళ ఆ తర్వాత డిప్రెషన్ కు గురైతే కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని కేకే సింగ్ తన ఫిర్యాదులో వెల్లడించినట్టు సమాచారం. గడిచిన ఏడాది కాలంలో సుశాంత్ అకౌంట్ లో ఉన్న రూ.17కోట్లలో రూ.15 కోట్లు సుశాంత్ కు సంబంధం లేని వ్యక్తుల అకౌంట్లకు ట్రాన్సఫర్ అయింది.. సుశాంత్ క్రెడిట్ డెబిట్ కార్టులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో రియా చక్రవర్తి పాత్ర ఏంటి? ఆమె కుటుంబ సభ్యులకు ఎంత ట్రాన్స్‌ఫర్ అయ్యాయి అనే విషయాన్ని పోలీసులకు దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఈ కేసుపై విచారణ జరిపేందకు పాట్నా నుంచి ముంబైకి పంపారు. అయితే రియా చక్రవర్తి మరియు కుటుంబ సభ్యులు పాట్నా పోలీసులను కలవకుండా ముందస్తు బెయిల్ కి అప్లై చేసారని వార్తలు వస్తున్నాయి.