Begin typing your search above and press return to search.
సుశాంత్ సింగ్ సిస్టర్స్ పై రియా ప్రతీకారం?!
By: Tupaki Desk | 9 Jan 2021 7:50 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ బలవన్మరణం సంచలనం సృష్టించి ఇప్పటికే నెలలు గడుస్తోంది. ఈ కేసులో సీబీఐ ఎలాంటి పురోగతి కనబరచకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద కేసును సిబిఐ ఇంకా విచారిస్తోంది. మరోవైపు రియా వర్సెస్ సుశాంత్ ఫ్యామిలీ ఎపిసోడ్లు ముదిరిపాకాన పడుతుండడం వేడెక్కిస్తోంది.
సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్ర ఉందని సుశాంత్ కుటుంబం ఆరోపించిన సంగతి తెలిసినదే. ముఖ్యంగా సుశాంత్ సోదరీమణులు రియాపై పోలీస్ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సోషల్ మీడియాల్లోనూ ఉద్యమాలు నడిపించారు. అనంతరం రియాను మాదకద్రవ్యాల సేకరణ కేసులో ఎన్.సి.బి అరెస్టు చేసి విచారించింది. అయితే రియా ఈ కేసులో బెయిల్ పొంది ఇటీవలే బయటపడిన సంగతి తెలిసినదే. ఇంతకుముందే సుశాంత్ సోదరీమణులపై రియా కౌంటర్ గా కోర్టుకు ఫిర్యాదు చేశారు.
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరీమణులపై రియా చక్రవర్తి ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారు. ఫిర్యాదులో సుశాంత్ సోదరీమణులు ప్రియాంక .. మితు ఒక డాక్టర్ తరుణ్ కుమార్ తో కుమ్మక్కయ్యారు. హత్య.. మోసం.. ఫోర్జరీ.. మెడికల్ ప్రిస్క్రిప్షన్ .. క్రిమినల్ కుట్ర వంటి కల్పిత ఆరోపణలతో తనపై కేసులు వేసి వేధించారని ప్రత్యారోపణలు చేసారు.
సుశాంత్ సోదరి ప్రియాంకకు స్నేహితుడైన వైద్యుడి నుండి `ఆందోళన నియంత్రణ` కోసం సుశాంత్ మెడిసిన్ తీసుకునేవాడని ఇప్పటికే వెల్లడైంది. 8 జూన్ 2020 నుండి సుశాంత్ .. అతని సోదరి ప్రియాంక మధ్య వాట్సాప్ చాట్ రివీలైంది. స్పెషలిస్ట్ వైద్యుడితో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసినట్లు తెలిసిపోయింది.
రియా చక్రవర్తి తన ఫిర్యాదులో కౌంటర్ ఏమని దాఖలు చేశారంటే.. ప్రియాంక.. మితు .. డాక్టర్ తరుణ్ కుమార్ అంతా కలిసే సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చారని .. వైద్యుడిని సంప్రదించకుండా ఇలా చేయడం నేరమని ఆరోపించారు. ఎస్.ఎస్.ఆర్ సోదరీమణులు ఎఫ్.ఐ.ఆర్ ను సవాలు చేయగా..., ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం టెలిమెడిసిన్ ద్వారా వైద్యులు అతనికి మందులు సూచించవచ్చని వారి న్యాయవాదులు వాదించారు.
అతను తీసుకుంటున్న మందులతో మాదక ద్రవ్యాలను మిళితం చేస్తున్నాడని తనవారికి చెప్పి సహాయాన్ని కోరాను. ఇది ప్రమాదకరమైన కాక్టెయిల్ అవుతుందని హెచ్చరించాను. అతను మందులు తీసుకుంటున్నట్లు నాకు తెలుసు. దానిపై నేను అతనితో వాగ్వాదానికి దిగాను. కాని ప్రిస్క్రిప్షన్ గురించి నాకు తెలియదు. ప్రిస్క్రిప్షన్ సోషల్ మీడియాలో లీక్ అయినప్పుడు అతని సోదరీమణులు ఇస్తున్నారని.. వారి సలహాతోనే ఇదంతా అని నేను గ్రహించాను. కనుక ఇదే అతని ఆత్మహత్యకు కారణమైందని నేను గ్రహించాను. ఈ మందులను ఇంతకు ముందెన్నడూ సూచించని వైద్యుడు(సుశాంత్ సోదరి ఫ్రెండు) సూచించాడని నేను నా ఫిర్యాదులో చెప్పాను.
అతని ఫిజికల్ అప్పియరెన్స్ పని లేకుండా వారు మెడిసిన్ ని సూచించారు. వైద్యుడితో ముందస్తు సంప్రదింపులతో మాత్రమే టెలిమెడిసిన్ సూచించవచ్చు. నా ఫిర్యాదు నకిలీ ఔషధాల ప్రిస్క్రిప్షన్ కు సంబంధించినది కూడా. నేను ఎత్తి చూపుతున్న పరిస్థితులను కూడా పరిశీలించాలి. అతని మరణానికి కారణం అతని కుటుంబం. నేను బాధ్యత వహిస్తున్నానని... దర్యాప్తు కోసం ఈ సాయం`` అంటూ రియా తరపున లాయర్ మనేషిందే సుదీర్ఘ నోట్ ని రివీల్ చేశారు. ప్రస్తుతం దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.