Begin typing your search above and press return to search.
రియా చక్రవర్తికి సవాల్ గా మారిన బాలీవుడ్ కెరీర్!
By: Tupaki Desk | 9 Oct 2022 8:31 AM GMTబాలీవుడ్ సెన్షేషన్ రియా చక్రవర్తి నటిగా కంటే సుషాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ప్రెండ్ గా ఎంతగా ఫేమస్ అయిందన్నది చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు చేసినా సినిమాలు తక్కువే అయినా సుషాంత్ సింగ్ గాళ్ ప్రెండ్ గానే ఫేమస్ అయింది. అటుపై సుషాంత్ మరణం తర్వాత అమ్మడి పేరు ఇటా బయటా హాట్ టాపిక్ గా మారింది.
అతను చరిపోయిన తర్వాత డ్రగ్స్ కేసు ఆరోపణలతో జైలు కెళ్లడం తీవ్ర నెగిటివిటీని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇప్పుడీ కేసు రియాకి సవాల్ గా మారింది. నిర్దోషిగా తేలేవరకూ స్వేచ్ఛలేని పరిస్థితి. మరి ఈ ప్రతికూల వాతావరణం అమ్మడి వృతిగత జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందా? అంటే అవుననే వినిపిస్తోంది.
సుషాంత్ సింగ్ రాజు పుత్ మరణించి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ వ్యవధిలో రియా కేవలం ఒకే ఒక్క సినిమా `చిచోరే` చేసింది. అదీ మూడేళ్ల గ్యాప్ తర్వాత రాకరాక వచ్చిన అవకాశం. సుషాంత్ మరణం తర్వాత చేసిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కూడా సుషాంత్ మరణానికి ముందు కమిట్ అయిన సినిమా. ఆ తర్వాత ఇంత వరకూ కొత్త సినిమా చేసింది లేదు.
మధ్యలో పోలీసుల విచారణకు హాజరవ్వడం వంటివి జరిగాయి. ఈ పరిస్థితులు అన్నింటని విశ్లేషిస్తే అమ్మడి కెరీర్ పై ఇవన్నీ ప్రతికూలతను తెలియజేస్తున్నట్లే కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఏ దర్శక-నిర్మాత కొత్త అవకాశం ఇవ్వడానికి ముందుకొస్తున్నట్లు కనిపించేదు. గతంలో సంజయ్ దత్..సోనాలి బింద్రే సహా పలువుర్ని ఇలాగే కొన్ని రకాల కేసులు ఇబ్బందులకు గురిచేసాయి.
జైలు జీవితం అనంతనం సంజయ్ దత్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆయనకు అవకాశాలు తగ్గాయి. అలాగే కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కోన్న సోనాలి బింద్రేని బాలీవుడ్ ఎంకరేజ్ చేయలేదు. సల్మాన్ ఖాన్ సైతం ఇదే కేసులో ఉండటంతో అతనికి ఇబ్బందులు తప్పలేదు. అయితే సల్మాన్ పెద్ద స్టార్ కావడం సహా సమాజ సేవలో ముందుండటంతో నెమ్మదిగా నెగివిటీని తప్పించుకోగలిగాడు. ఆ లెక్కన చూస్తే రియా చక్రవర్తిని ఈ వివాదం ఇప్పట్లో వదలడం కష్టంగానే కనిపిస్తుందని బాఈలవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.