Begin typing your search above and press return to search.

సుశాంత్‌ రాజులా బతికాడు : రియా చక్రవర్తి

By:  Tupaki Desk   |   28 Aug 2020 2:30 AM GMT
సుశాంత్‌ రాజులా బతికాడు : రియా చక్రవర్తి
X
బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముందుగా సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ.. చివరికి సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. రియా తన కొడుకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్లిపోయిందని.. సుశాంత్‌ ను తమకు దూరం చేసిందని.. ఆమె కారణంగానే ఇదంతా జరిగుంటుందని ఆరోపించాడు. అప్పటి నుంచి రియానే సుశాంత్ మరణానికి కారణమనే రీతిలో నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రియా పై మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారించారు. ఇక ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.

కాగా రియా చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్‌ కు సంబంధించి పలు విషయాలు వెల్లడించింది. రియా మాట్లాడుతూ 'సుశాంత్‌ రాజులా బతికాడని.. అతడు భారీగా ఖర్చు చేసేవాడని' చెప్పింది. ఫ్యాషన్ బ్రాండ్ ఈవెంట్ కోసం ఒంటరిగా పారిస్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నానని.. దానికి వసతి మరియు బుకింగ్‌ లు కంపెనీ వారే చేసారని.. అయితే సుశాంత్ ఆలోచనతో అది యూరప్ ట్రిప్ గా హాలిడేగా మారిందని.. తన బుకింగ్స్ మొత్తాన్ని రద్దు చేసి సుశాంత్ ఇష్టప్రకారం కొత్త బుకింగ్స్ చేశాడని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం సుశాంత్ తన ఫ్రెండ్స్‌ తో కలిసి థాయ్‌ లాండ్ ట్రిప్ వెళ్లాడని.. దాని కోసం ఏకంగా రూ.70 లక్షలు ఖర్చు చేసాడని.. ఓ ప్రైవేట్ జెట్ బుక్ చేసుకున్నాడని రియా చక్రవర్తి చెప్పారు. ఇలాంటివి చాలా ఉన్నాయని.. సుశాంత్ ఖర్చు గురించి వెనుకాడేవాడు కాదని.. ఎప్పడూ భారీగా ఖర్చు చేస్తూ ఉండేవాడని రియా వెల్లడించింది. అంతేకాకుండా తాను సుశాంత్ భార్యభర్తల్లా కలిసి ఉన్నామని.. సుశాంత్ డబ్బుతో తాను జల్సాలు చేయలేదని.. ఆ ట్రిప్ లో అందరితో పాటే తనకు ఖర్చు చేసాడని రియా చెప్పుకొచ్చింది.