Begin typing your search above and press return to search.
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ కోసం సల్మాన్ - సంజయ్ దత్ లాయర్...!
By: Tupaki Desk | 29 July 2020 9:10 AM GMTయువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కూడా ఈ కేసులో భాగంగా విచారించడం జరిగింది. అయితే సుశాంత్ మరణించిన ఇన్ని రోజుల తరువాత ఆయన తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. సుశాంత్ మృతికి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కారణమంటూ ఆయన పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ ప్రముఖ లాయర్ ని రియా చక్రవర్తి నియమించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
కాగా గతంలో సంజయ్ దత్ - సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల కేసులు వాదించిన సతీష్ మాన్షిండే అనే ప్రముఖ క్రిమినల్ లాయర్ ని రియా నియమించుకున్నారని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం సతీష్ దగ్గర పని చేస్తున్న మరో క్రిమినల్ లాయర్ ఆనంది ఫెర్నాండెజ్ రియాను కలిశారని.. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. లాయర్ ఆనంది రియా నివాసం నుండి బయటకి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో రాత్రి నుండి హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మందస్తు బెయిల్ కోసం రియా లాయర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారని.. ఈరోజు సెషన్స్ కోర్టులో రియా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద రోజుకొక మలుపు తిరుగుతున్న సుశాంత్ ఆత్మహత్య కేసులో సుశాంత్ తండ్రి కంప్లైంట్ తో అతని గర్ల్ ఫ్రెండ్ రియా పాత్రపై పోలీసులు ఎక్కువగా ద్రుష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది.