Begin typing your search above and press return to search.
సూసైడ్ చేసుకోకపోతే రేప్ చేసి చంపేస్తాం..!
By: Tupaki Desk | 16 July 2020 3:00 PM GMTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా కారణమని నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సూసైడ్ పై భావోద్వేగ పోస్ట్ పెట్టింది. 'నువ్వు లేవనే నిజాన్ని నమ్మలేక నా భావోద్వేగాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను.. నా హృదయంలోని అలజడి నన్ను ఇంకా కలవరపెడుతూనే ఉంది.. నువ్వు దూరమై నెలరోజులవుతోంది.. అయినా నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అని రియా తన నోట్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో రియాని నెటిజన్లు తీవ్రమైన పదజాలంతో ట్రోల్ చేసారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో కొంతమంది సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమని అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి ఇంస్టాగ్రామ్ లో హత్య అత్యాచారం బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవాలని మన్నూ రౌత్ అనే మహిళ రియాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. రియా చక్రవర్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. "నిన్ను కచ్చితంగా అత్యాచారం చేసి చంపేస్తాం. కాబట్టి నీకు నీవుగా ఆత్మహత్య చేసుకోవడం మంచిది. లేకపోతే మేమే నిన్ను చంపేస్తాం" అంటూ బెదిరిస్తూ ఉన్న మెసేజ్ స్క్రీన్ షాట్ షేర్ చేసింది. రియాను ట్రోల్ చేస్తున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన రియా.. ''నన్ను గోల్డ్ డిగ్గర్ అని పిలిచారు.. నేను మౌనంగా ఉండిపోయాను. నన్ను హంతకురాలు అని పిలిచారు.. నేను మౌనంగా ఉండిపోయాను. నాకు సిగ్గు లేదని మొహం మీదే తిట్టారు.. నేను మౌనంగా ఉండిపోయాను. కానీ నేను ఆత్మహత్య చేసుకోవాలని లేకపోతే అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించే హక్కు నా మౌనం మీకు ఎలా ఇస్తుంది? అది ఎంత పెద్ద నేరమో మీరు రియలైజ్ అవుతున్నారా? ఇలాంటి దుర్మార్గమైన బెదిరింపులకు వేధింపులకు ఎవరూ పాల్పడవద్దు. ఇలాంటి వేధింపులు పునరావృతం కాకూడదు.. జరిగింది చాలు.." అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దయచేసి దీనిపై అవసరమైన చర్య తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను అభ్యర్థిస్తున్నానని వారిని ట్యాగ్ చేసింది.
ఇదిలా ఉండగా రియా చక్రవర్తి ట్విట్టర్ వేదికగా తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు సీబీఐకి అప్పగించాలని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాని వేడుకుంది. కేసు దర్యాప్తులో ప్రభుత్వ విచారణపై పూర్తి నమ్మకం ఉందని.. కానీ న్యాయం కోసం ఈ విషయంలో సీబీఐ విచారణ చేయాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఒత్తిళ్లు ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే అంటూ రియా పోస్ట్ పెట్టింది.