Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసు.. ఆమెను 9 గంటలు ప్రశ్నించిన పోలీసులు
By: Tupaki Desk | 19 Jun 2020 2:30 PM GMTహీరో సుశాంత్ ఆత్మహత్య కేసును ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. అత్మహత్య అని నిరూపితం అయ్యింది అంటూ ప్రకటించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ అనే విషయంలో ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుశాంత్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు మొత్తం 13 మందిని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఈ 13 మందిలో సుశాంత్ ప్రియురాలిగా ప్రచారం జరుగుతున్న రియా చక్రవర్తిని ఎక్కువ సమయం పోలీసులు ప్రశ్నించారు.
రియా చక్రవర్తిని పోలీసులు ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అంటే దాదాపుగా 9 గంటల పాటు ఆమెను ప్రశ్నించారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుశాంత్ కు సంబంధించిన పలు విషయాలను ఆమె నుండి పోలీసులు సేకరించారట. ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో మాట్లాడిన విషయాలు ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను గురించి రియా చక్రవర్తి ని ప్రశ్నించి తెలుసుకున్నారట.
రియా చక్రవర్తి పోలీసుల విచారణలో ముఖ్యంగా యష్ రాజ్ ఫిలింస్ తో సుశాంత్ పెట్టుకున్న అగ్రిమెంట్ గురించి ఆ బ్యానర్ లో చేయాల్సి ఉండి క్యాన్సిల్ అయిన పానీ చిత్రం గురించిన విషయాలను చెప్పిందట. ఇటీవలే యష్ రాజ్ ఫిల్మ్స్ తో సుశాంత్ పెట్టుకున్న అగ్రిమెంట్ కూడా పూర్తి అయ్యిందని ఈ సందర్బంగా రియా చక్రవర్తి పేర్కొంది. ఇదే సమయంలో తనను కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా సుశాంత్ సుచించాడని కూడా పోలీసులకు రియా చెప్పిందట.
సుదీర్ఘంగా రియాను విచారించిన పోలీసులు మళ్లీ కూడా ఆమెను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ వర్గాల వారు అనుకుంటున్నారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో రియా గురించి బాలీవుడ్ మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆమె ప్రతి కదలిక కూడా మీడియాలో హైలైట్ అవుతోంది.
ఇక సుశాంత్ యష్ రాజ్ ఫిలింస్ ఒప్పందం గురించి కూడా ప్రచారం జరుగుతోంది. శేఖర్ కపూర్ ఈ విషయమై స్పందిస్తూ పానీ చిత్రం సుశాంత్ తో చేయలేక పోవడం చాలా బాధగా ఉందన్నాడు. ఆ సినిమా చేసి ఉంటే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయేవాడు కాదేమో అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.