Begin typing your search above and press return to search.
నేను సూపర్ గా ఉన్నానుః రియా చక్రవర్తి
By: Tupaki Desk | 6 Feb 2021 12:10 PM GMTడ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి గత అక్టోబరులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా రోజుల పాటు మానసికంగా కుంగుబాటుకు లోనైన రియా.. ఈ మధ్యనే నార్మల్ అవుతోంది.
తాజాగా.. శుక్రవారం ముంబైలోని తన రెగ్యులర్ జిమ్ లో కసరత్తులు పూర్తిచేసిన రియా బయటకు వస్తుండగా.. మీడియా కంట పడింది. దీంతో వారు కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంగా వారు ఎలా ఉన్నారు అని అడగ్గా.. ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ సమాధానమిచ్చింది బ్యూటీ.
ఇక, అంతకు ముందు రోజు కూడా ఇదే జిమ్ సెంటర్ వద్ద తన సోదరుడితో కలిసి కనిపించింది రియా. ఈ సందర్భంగా ఆమె సోదరుడు షోయిక్ మీడియాకు ‘థమ్స్ అప్’ చూపించగా.. రియా మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫొటో గ్రాఫర్ ను ‘ఎక్స్ క్యూజ్ మీ’ అంటూ పక్కగా వెళ్లి కారులో కూర్చుంది.
ఈ సందర్భంగా షూట్ చేసిన వీడియోతోపాటు, క్లిక్ చేసిన ఫొటోల్లో రియా ప్రశాంతంగానే కనిపించింది. దీంతో.. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నట్టుంది రియా చక్రవర్తి. సుశాంత్ సింగ్ మరణానంతరం తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసు రియాకు చుట్టుకున్న విషయం తెలిసిందే.