Begin typing your search above and press return to search.
కొత్త కోణం: సుశాంత్ సింగ్ ని యాంగ్జయిటీ మందులే చంపేశాయా?
By: Tupaki Desk | 8 Sep 2020 11:30 PM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రోజుకో ట్విస్టు వేడి పెంచుతోంది. ఈ కేసులో నార్కోటిక్స్ అధికారులు ఇప్పటికే రియా చక్రవర్తి సహా ఆమె అనుయాయుల్ని అరెస్టులు చేయడంతో ముంబై వాతావరణం వేడెక్కింది. అసలు సుశాంత్ ని ప్రేమించడమే తాను చేసిన తప్పిదమా? తనతో స్నేహం చేయడమే నేరమా? అంటూ రియా తనవైపు నుంచి ఆవేదనను వెలిబుచ్చడమే గాక.. అతడి మరణంతో తనకు కానీ తన కుటుంబీకులకు కానీ ఎలాంటి సంబంధాలు లేవని ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేసింది.
అయినా నార్కోటిక్స్ బృందాలు రియాను అరెస్టు చేశాయి. ఇక ఈ కేసులో మరో కొత్త కోణం గురించి తాజాగా రివీలైంది. మందుల చీటీ ఉంటే కానీ కొనుగోలు చేయకూడని `యాంగ్జయిటీ మెడిసిన్` సుశాంత్ కు అందేలా అతడి ఇద్దరు అక్కలు ఓ బోగస్ మందుల చీటీని తీసుకొచ్చారని.. సుశాంత్ ఆత్మహత్యకు ఇదే కారణమని రియా ఆరోపించిన కోణం వెలుగు చూసింది. తొలి నుంచి తన సోదరీమణులతో సుశాంత్ కి సత్సంబంధాలు లేవని రియా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ రియా కుటుంబమే అతడి మరణానికి కారణమని సుశాంత్ సోదరీమణులు ప్రత్యారోపణలు చేసి రియాపై కేసులు పెట్టారు. దీనిపై లోతైన విచారణ చేసిన సీబీఐ- నార్కోటిక్స్ - ఈడీ బృందాలు రియాను తప్పు పట్టాయి. డ్రగ్స్ కోణంలో రియాను అరెస్టు చేశారు. అయితే సుశాంత్ మరణంతో రియాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది ఇంకా తేలలేదు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా రియా కుట్ర చేసిందా? అన్నది కోర్టుల్లో తేల్చాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. ఇక బోగస్ మందుల చీటీ సుశాంత్‌కు ఎలా దొరికిందో ఆయన ఇద్దరు అక్కలు.. డాక్టర్ తరుణ్ సమాధానం చెప్పాలని రియా ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సుశాంత్ వాట్సాప్ చాట్ లలో యాంగ్జయిటీ ఔషధాలు తీసుకోవాలని ఆయన సోదరి ప్రియాంకా సింగ్ సూచించినట్లు బయటపడింది. ఆ మందులు తీసుకోవద్దని రియా స్వయంగా సుశాంత్ కి చెప్పిందట. మరి ఈ కోణంలో విచారణలో ఎలాంటి కొత్త విషయాలు బయటపడతారో చూడాలి. ఇక రియా చక్రవర్తిని తొలి నుంచి టాలీవుడ్ నటి మంచు లక్ష్మి డిపెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలాకే రియాను దోషిగా చూడాల్సి ఉంటుందని లక్ష్మీ మంచు అభిప్రాయపడ్డారు.