Begin typing your search above and press return to search.
రియా కన్నీరుమున్నీరవుతుంటే టీషర్లుల వ్యాపారమా?
By: Tupaki Desk | 12 Sep 2020 12:30 AM GMTసుశాంత్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీ కేసు గత కొన్నిరోజులుగా రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో ఆమెనే ప్రధాన నిందితురాలంటూ ఓ వర్గం మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. డ్రగ్స్ కి సుశాంత్ మృతికి దగ్గరి సంబంధం వుండటం.. అందులో రియా పాత్ర వుందని తెలిపే సాక్ష్యాధారాలు బయటపడటంతో రియాని ఎన్.సీ.బీ అధికారులు విచారణ సాగడం ఆ తరువాత అరెస్ట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రియా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
రియా చక్రవర్తి పోలీసు విచారణకు హాజరైన క్రమంలో ఓ ప్రత్యేక స్లోగన్ వున్న బ్లాక్ టీషర్ట్ ని ధరించింది. ఇప్పడా బ్రాండ్ టీషర్ట్ మార్కెట్లో హాట్ కేక్ గా మారిపోయింది. ఆ టీషర్ట్ పై రోజెస్ ఆర్ రెడ్.. వాయిట్స్ ఆర్ బ్లూ .. లెట్స్ స్మాష్ ది పట్రియార్చీ మి అండ్ యు` అని రాసి వుంది. రియా అరెస్ట్ అనంతరం బాలీవుడ్ కు చెందిన విద్యాబాలన్ .. అనురాగ్ కశ్యప్.., సోనమ్ కపూర్.., తాప్సీ .., కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఇదే స్లోగన్ ని షేర్ చేసి తమ మద్దతుని తెలిపారు.
అయితే ఈ టీషర్ట్ తయారి సంస్థకు ఇప్పుడు లక్షల్లో ఆర్డర్ లు వస్తున్నాయట. ముంబై బాంద్రాలో ఉన్న సంస్థ వాటిని ప్రీ ఆర్డర్ల మేరకు మాత్రమే తయారు చేస్తోంది. ఈ కంపెనీ బాంద్రాలో వుంది. ఇప్పటికే చాలా మంది ఆ కంపెనీకి ఆర్డర్‌లు చేస్తున్నారట. టి షర్ట్ కంపెనీ వారు విక్రయించే ప్రతి టీ-షర్టుకు సంవత్సరానికి సానిటరీ న్యాప్ కిన్ ల దానం చేస్తామని మాటిచ్చారట. దీంతో తాజా ఆర్డర్ ల నేపథ్యంలో వాటి సంఖ్య కూడా భారీగానే పెరగనుండటం గమనార్హం.