Begin typing your search above and press return to search.
అమ్మాయిలు ఆ ట్రాప్ లో పడొద్దంటూ బాలీవుడ్ బ్యూటీ వార్నింగ్
By: Tupaki Desk | 9 Jan 2022 9:30 AM GMTఅందరూ చేసేదే. కానీ.. ఆ విషయాన్ని అంత లోతుగా ఆలోచించరు. కానీ.. ఆ విషయంలో అందరి మైండ్ సెట్ మారాలన్న రీతిలో బాలీవుడ్ బ్యూటీ ఒకరు చేస్తున్న విన్నపం అందరిని ఆకర్షించటమే కాదు.. ఆలోచనల్లో పడేలా చేస్తోంది. అందంగా కనిపించటం వేరు.. అందంగా కనిపించటం కోసం తహతహలాడటం వేరు. ఏం చేసినా.. ఎలా చేసినా.. మనకుండే ఒరిజినాలిటీని మార్చటం సాధ్యం కాదు. అది సత్యం. అయితే.. దాన్ని పక్కన పెట్టేసి.. తాము అందంగా ఉన్నామన్న భావనను కలిగించటం కోసం పలువురు అమ్మాయిలు చేసే ఒక తప్పును వేలెత్తి చూపిస్తోందని బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి.
మిగిలిన సెలబ్రీలకు కాస్త భిన్నంగా సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తరచూ ఆసక్తికర సంభాషణలు.. స్ఫూర్తిదాయకమైన పోస్టుల్ని పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యూత్ ఎక్కువగా ఎంగేజ్ అయ్యే ఇన్ స్టా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది రియా. అన్నింటికి మించిన అమ్మాయిలు ఇన్ స్టాలో పోస్టు చేసే తమ ఫోటోలను మరింత అందంగా మార్చే ఫిల్టర్లను వాడే విషయంలో జాగ్రత్త పడమని చెబుతోంది.
''అమ్మాయిలందరికి ఒక చిన్న విన్నపం. మీరు ఇన్ స్టా బ్యూటీ ఫిల్టర్ల ట్రాప్ లో పడకండి. అదొక మాయ. మీరు ఎలా ఉన్నారో అదే మీ అందం. ఈ మధ్యన మీరు ఈ ఇన్ స్టా బ్యూటీ ఫిల్టర్లగురించి ఎలా ఫీల్ అవుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారందరికి నేనేం చెబుతానంటే.. మీరు మీరుగా ఉండటమే నిజమైన అందం' అంటూ సూటి మాటలతో స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది.
నిజమే కదా.. లేని అందాన్ని ఫోటోలో తీసుకురావటం బాగానే ఉన్నా.. తర్వాతి రోజుల్లో ఫోటోలో మాదిరి తాము లేమన్న దిగులు కమ్మేయటం.. అది లేనిపోని డిప్రెషన్ లోకి తీసుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. రియా చెప్పిన సలహాను అమ్మాయిలందరూ పాటిస్తూ.. మాయదారి 'ఇన్ స్టా' బ్యూటీ టూల్ ట్రాప్ లో పడకుండా ఉండటం చాలా అవసరం.