Begin typing your search above and press return to search.
రియా ఉన్నట్టా లేనట్టా.. ఎట్టకేలకు సస్పెన్స్ వీడిందిలా..!
By: Tupaki Desk | 19 March 2021 1:30 PM GMTరియా చక్రవర్తి చుట్టూ అల్లుకున్న వివాదాల గురించి తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక రియా పాత్రపై సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొన్నాళ్ల జైలు శిక్ష అనంతరం బెయిల్ పై రియా జనసామాన్యంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
జైలు శిక్ష- వివాదాల వల్ల రియా నటిస్తున్న చెహ్రే మూవీ ప్రమోషన్స్ నుంచి తనని బహిష్కరించడంపై తన అభిమానులు సీరియస్ అయ్యారు. పోస్టర్లు.. టీజర్ సహా ఎక్కడా రియాను పబ్లిసిటీలో చూపించకపోవడంపై సదరు దర్శకనిర్మాతలపై ఫ్యాన్స్ గుర్రుమన్నారు.
ఎట్టకేలకు రియా నటించిన `చెహ్రే` ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఇమ్రాన్ హష్మి -అమితాబ్ బచ్చన్ సహా తారలంతా కనిపించారు. ఓ ఇంట్రెస్టింగ్ రియాలిటీ గేమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రియా పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తాజా ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ ఆద్యంతం ఇమ్రాన్ -బిగ్ బి మధ్య గేమ్ ని ఎలివేట్ చేస్తూ చివరిలో రియా చక్రవర్తి గ్లింప్స్ తో ట్రైలర్ ని ముగించారు.
నిజ జీవితంలో క్లూ గేమ్ ఆడే ప్రవృత్తి కలిగిన ఆక్టోజెనెరియన్ హ్యాబిట్ గురించిన సినిమా ఇది. ప్రమాదకరమైన మంచు తుఫాను మధ్య పర్వతాలలో నివాసం ఉంటున్న అమితాబ్ ఇంటి వద్ద ఆశ్రయం పొందిన ప్రకటన ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ గా ఇమ్రాన్ హస్మి కనిపిస్తారు. అమితాబ్ .. అతని వంశం నేరం-శిక్షల గేమ్ కోసం ఇమ్రాన్ ని ఆ ఇంట్లో బంధిస్తారు. ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా సాగే ఈ గేమ్ నుంచి ఇమ్రాన్ హస్మి బయటపడ్డాడా లేదా? అన్నది ఆసక్తికరం. ఈ ట్రైలర్ చివరకు రియా చక్రవర్తి ని పరిచయం చేసింది. పోస్టర్ టీజర్ లో కనిపించని రియా ఎట్టకేలకు ట్రైలర్ లో కనిపించగానే అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణానికి సంబంధించిన వివాదంలో చిక్కుకోవడానికి ఒక సంవత్సరం ముందు (జూలై 2019 లో) చెహ్రే నుండి రియా తన ఫస్ట్ లుక్ ను పంచుకుంది. కానీ రిలీజ్ ముందు ప్రమోషన్స్ నుంచి తనని స్కిప్ చేశారు మేకర్స్. గత సంవత్సరం సుశాంత్ మరణం తరువాత డ్రగ్స్ దర్యాప్తు లో భాగంగా రియాను అరెస్టు చేయడంతో నిర్మాతల్లో డైలమా వల్లనే ఇలా చేశారని టాక్ వినిపించింది.
ఒక ప్రముఖ దినపత్రిక ఇంటర్వ్యూలో.. నిర్మాత ఆనంద్ పండిట్ రియా పబ్లిసిటీలో లేకపోవడం వెనక రహస్యాన్ని అంగీకరించాడు. ``మేము రియా గురించి ఈ సమయంలో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నందున మేము స్పందించలేదు. సరైన సమయంలో ఆమెకు సంబంధించిన ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాం. ఈ సమయంలో నేను ఇంకేమీ చెప్పలేను`` అని ఆనంద్ మిడ్-డేతో అన్నారు.
చెహ్రేకు రూమి జాఫ్రీ దర్శకత్వం వహించారు. ఒక నేరానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడుతున్న ధ్రువణ వ్యక్తుల కథ ఏమిటన్నది ఇందులో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో అన్నూ కపూర్- ధృతిమాన్ ఛటర్జీ- రఘుబీర్ యాదవ్- క్రిస్టల్ డిసౌజా- సిద్ధాంత్ కపూర్ కూడా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9 న థియేటర్లలోకి రానుంది.