Begin typing your search above and press return to search.

వెడ్డింగ్ డే.. గుండెను క‌దిలించిన క‌పూర్ డాటర్ నోట్

By:  Tupaki Desk   |   17 Aug 2021 11:30 AM GMT
వెడ్డింగ్ డే.. గుండెను క‌దిలించిన క‌పూర్ డాటర్ నోట్
X
బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ క‌పూర్ వార‌సురాలు రియా కపూర్ వివాహ వేడుక నుంచి ఫోటోల బంచ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇందులో ఒక ఛాయాచిత్రం ప్ర‌త్యేకించి వైర‌ల్ గా మారింది. సోమవారం తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన భర్త కరణ్ బూలానీతో మొదటి వివాహ చిత్రాన్ని రియా క‌పూర్ పంచుకుంది. తన భర్తకు హృదయపూర్వక నోట్ కూడా రాసింది. బెస్ట్ ఫ్రెండ్ అంటూ త‌న భ‌ర్త గురించి ప‌రిచ‌యం చేసింది. ఆగస్టు 14 శనివారం కపూర్ ల జుహు ఇంటిలో ఒక ప్రైవేట్ వేడుకలో ఈ జంట వివాహం జ‌రిగింది.

భాగస్వామితో రియా ఫోటో చాలా ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది. ఇది సాంప్రదాయక పంథాలో సాగిన సింపుల్ వెడ్డింగ్. ఇక పెళ్లి కూతురు దుస్తుల్లో రియా ఎంతో అందంగా క‌నిపించింది. అలాగే ఈ ఫోటోలో త‌న భ‌ర్త‌ కరణ్ రియా వేలుకి ఉంగరం తొడుగుతుండ‌డం క‌నిపించింది. ఫోటోకి రాసిన శీర్షిక‌లో రియా తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ ప్రేమపూర్వకంగా ఇలా పేర్కొంది. 12 సంవత్సరాల తరువాత మీరు నా బెస్ట్ ఫ్రెండ్ .. అత్యుత్తమ వ్యక్తి కాబట్టి నేను భయపడకూడదు లేదా బాధపడకూడదు. కానీ నేను ఏడుస్తూ కదిలిపోయాను.. కడుపు తిప్పింది.. అని ఎమోష‌న్ అయ్యారు రియా.

నా తల్లితండ్రులు నిద్రపోయే ముందు రాత్రి 11 గంటలకు జుహు ఇంటికి రావాల్సిన అమ్మాయిని నేను.. ఇప్పటి వరకు మాత్రమే ఇలా.. మేము ఒక కుటుంబానికి ద‌గ్గ‌ర‌య్యాం. మా జీవితంలో చాలా ప్రేమలు ఉన్నాయి ...అని ఎమోష‌న‌ల్ నోట్ రాశారు. అనిల్- సునీతా కపూర్ దంప‌తులు స‌హా రియా తోబుట్టువులు సోనమ్ - హర్షవర్ధన్ .. భర్త కరణ్ ఈ పోస్ట్ కు ట్యాగ్ చేసి ఉన్నారు. రియా త‌న సోద‌రి సోన‌మ్ తో క‌లిసి ప‌లు ఫ్యాష‌న్ బ్రాండ్ల వ్యాపారంలో ఉన్నారు. ప్ర‌ఖ్యాత మైంత్ర‌కు వీరు ప్ర‌మోష‌న్ చేసిన సంగ‌తి తెలిసిందే.