Begin typing your search above and press return to search.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. ఇది ఎన్సీబీ పరిధిలోకి రాదు : హైకోర్టుకు రియా

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:33 PM GMT
ఈ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. ఇది ఎన్సీబీ పరిధిలోకి రాదు : హైకోర్టుకు రియా
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో రియా చక్రవర్తి మరియు ఆమె షోవిక్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా - సహాయకుడు దీపేష్‌ సావంత్‌ లతో పాటు డ్రగ్స్‌ మాఫియాతో లింకులున్న జాయేద్‌ విలాట్రా - అబ్దెల్‌ బాసిత్‌ పరిహార్‌ - కైజన్‌ ఎబ్రహీం - కర్ణా అరోరా - అనుజ్‌ కేశ్వీనీ - అబ్బాస్‌ లఖానీ లను అదుపులోకి తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ 8న అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా ఉమెన్స్ జైలులో ఉంది. ఈ క్రమంలో రియా మరియు షోవిక్ లకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వారి బెయిల్‌ పిటిషన్‌ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైకోర్టు సెలవులో ఉన్న కారణంగా రేపు(గురువారం) బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.

కాగా, రియా తరపు న్యాయవాది సతీష్ మనేషిందే.. ఎన్సీబీ దర్యాప్తు చట్టవిరుద్ధమని.. ఈ కేసు ఎన్సీబీ పరిథిలోకి రాదని.. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 27ఎ ప్రకారం 'అక్రమ ట్రాఫిక్‌ కు నిధులు సమకూర్చడం మరియు ఆశ్రయించడం' అనే తీవ్రమైన కమర్షియల్ నేరాలకు మాత్రమే అని బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారని తెలుస్తోంది. తన క్లయింట్స్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించనందున ఈ నేరం బెయిలబుల్ అని న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా రియా మరియు షోవిక్ లను సుశాంత్ మరణానికి సంబంధం ఉందనే అభియోగాలతో అరెస్ట్ చేసారని.. అందుకే ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కు బదిలీ చేయాలని న్యాయవాది కోరారు. 'సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా డెత్ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే భవిష్యత్ కేసులన్నీ కూడా సిబిఐకి ఇవ్వాలి' అని.. 1988 గెజిట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ కింద డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం ఉందని.. ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్సీబీ జరిపిన దర్యాప్తు చట్టవిరుద్ధం'' అని న్యాయవాది సతీష్ బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో ఎన్‌సిబికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్‌ తో పాటు పిటిషనర్ల న్యాయవాదులను కూడా న్యాయ అంశాలపై వివరణ ఇవ్వమని హైకోర్టు కోరినట్లు సమాచారం.