Begin typing your search above and press return to search.
రియా - KWAN ఏజెన్సీ మధ్య అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయా...?
By: Tupaki Desk | 29 Sep 2020 3:00 PM GMTయువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని.. డ్రగ్ వ్యవహారాల్లో సంబంధం కలిగి ఉందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందు నుంచి ఆర్థిక పరమైన అంశాలపై ఫోకస్ చేస్తూ వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియా చక్రవర్తి మరియు KWAN టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను గుర్తించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్ ఆధారంగా డ్రగ్స్ రాకెట్ తో క్వాన్ అధినేతలకు కూడా సంబంధాలు కలిగి ఉన్నారేమో అని ఎన్సీబీ వారిపై ద్రుష్టి పెట్టిందని.. అలానే క్వాన్ - రియాల మధ్య జరిగిన మల్టిపుల్ ట్రాన్సక్షన్స్ జరగడంతో ఈడీ కూడా డ్రగ్స్ కోణాన్ని పరిశీలిస్తోందని రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది.
ఈ నేపథ్యంలో KWAN మరియు రియాల మధ్య మార్చి 12న రూ.3,96,825 ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆర్.టి.జి.ఎస్ ద్వారా జరిగిందని.. కొన్ని రోజుల గ్యాప్ లోనే రెండవ ట్రాన్సాక్షన్ రూ .3,68,098 జరిగిందని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. అలానే మూడవ పేమెంట్ మే 2న నెఫ్ట్ ద్వారా రూ.1,60,651.. అదే నెలలో నాల్గవ పేమెంట్ 1,72,126 రూపాయలు జరిగిందని చెప్పుకొచ్చింది. 5వ ట్రాన్సక్షన్ రూ .1,59,300 జూన్ 4న చెక్ ద్వారా జరిగిందని.. అలానే జూన్ 25 - జూలై 4 - జూలై 6 - అక్టోబర్ 4 మరియు నవంబర్ 18న వరుసగా రూ .2,75,400 - రూ .1,36,802 - రూ 2,75,400 - రూ .1,17,900 మరియు 1,21,125 రూపాయలు ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా ట్రాన్సక్షన్స్ జరిగాయని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. రియాకు క్వాన్ ఇంత మొత్తంలో ఎందుకు చెల్లించిందని.. దీంట్లో డ్రగ్స్ కోణం ఏమైనా ఉందా అని ఈడీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బాలీవుడ్ డ్రగ్ కేసు దర్యాప్తులో KWAN టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేరు రావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసులో దీపికా పదుకొనే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు క్వాన్ ఎగ్జిక్యూటివ్స్ జయ సాహా మరియు కరిష్మా ప్రకాష్ లను కూడా ప్రశ్నించింది.