Begin typing your search above and press return to search.
అంకితా లోఖండేకు ఫ్లాట్ ఇచ్చిన సుశాంత్?
By: Tupaki Desk | 15 Aug 2020 2:30 AM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ మిస్టరీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సుశాంత్ మృతి వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం జరిగిందని, రూ.15 కోట్ల మేర రియా అవకతవకలకు పాల్పడిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. దీంతో, రియాను ఈడీ అధికారులు రెండోసారి విచారణ జరుపుతున్నారు. ఈడీ విచారణలో రియా ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే నివాసముంటోన్న ఫ్లాట్ కు సుశాంత్ ఈఎంఐలు చెల్లించేవాడని రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. మలాద్ లోని అంకితా ఫ్లాట్ కు సుశాంత్ దాదాపు నాలుగున్నర కోట్లు చెల్లించాడని రియా చెప్పినట్లు తెలుస్తోంది.
సుశాంత్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరుపుతున్న ఈడీ....ఈ వ్యవహారంలో అంకితా లోఖండేనూ విచారణ జరిపేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించినట్లు సుశాంత్ ఖాతా నుంచి బదిలీ అయిన ఆ 15 కోట్ల వ్యవహారంపై ఈడీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే రియాను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, సుశాంత్ మరణంతో మనీ ల్యాండరింగ్ వ్యవహారం ముడిపడి ఉందన్న అనుమానంతో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తి ఆస్తులు, పెట్టుబడులతో పాటు వ్యాపార లావాదేవీలపై ఈడీ ఫోకస్ చేస్తోంది. ముంబై నగరంలోని ఘర్ ప్రాంతంలో ఉన్న స్థిరాస్థికి సంబంధించి రియా చక్రవర్తిని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సుశాంత్ నుంచి తీసుకున్న డబ్బులతోనే ఈ ఆస్తులను రియా కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.