Begin typing your search above and press return to search.
సుశాంత్ పై రియా సంచలన కామెంట్స్ చేసిన వీడియో వైరల్...!
By: Tupaki Desk | 31 July 2020 1:30 PMబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు విషయంలో రోజుకొక విషయం బయటకి వస్తోంది. సుశాంత్ ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని.. హత్య చేశారని ఇలా ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే సుశాంత్ బలవన్మరణానికి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ బీహార్ లో సుశాంత్ తండ్రి కేసు నమోదైన సంగతి తెలిసిందే. రియా తన కొడుకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్లిపోయిందని.. సుశాంత్ ను తమకు దూరం చేసిందని.. ఆమె కారణంగానే తన కొడుకు డిప్రెషన్ లోకి వెళ్ళాడు.. చివరికి సుశాంత్ ని ఒంటరిగా వదిలేసి వెళ్లిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా సుశాంత్ సూసైడ్ కేసు విషయంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించమని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ని కోరిన రియా ఇప్పుడు ఈ కేసు ముంబై పోలీసులకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్లడంపై అందరూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ సుశాంత్ మాజీ ప్రేయసి.. అతని ఫిట్నెస్ ట్రైనర్ కూడా రియా నే సుశాంత్ మరణానికి బాధ్యురాలు అన్నట్లుగా కామెంట్స్ చేసారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ అనుమానాలు మరింత బలపడేలా కనిపిస్తున్నాయి. తాజాగా రియా సుశాంత్ ను ఉద్దేశిస్తూ కొన్ని సంచలన కామెంట్స్ చేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ''సుశాంత్ తెలివి తక్కువ వాడు.. అతన్ని నేను ఈజీగా కంట్రోల్ లో పెట్టగలను'' అని రియా చక్రవర్తి మాట్లాడింది. అయితే ఇది ఎప్పటి వీడియో అనేది తెలియలేదు. అంతేకాకుండా ఆమె సుశాంత్ పై ఉద్దేశ పూర్వకంగా అలాంటి కామెంట్స్ చేసిందా లేదా సరదాగా అలా మాట్లాడిందో తెలియదు కానీ ఈ వీడియోతో రియాపై అనుమానం బలపడేలా చేస్తోంది. నిజానిజాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.