Begin typing your search above and press return to search.
ఏడుస్తుంటే ఫొటోలు తీస్తారా?
By: Tupaki Desk | 3 July 2017 8:18 AM GMTసినీ తారలు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూసుకోకుండా ఫొటోలు తీయడం కోసం ఎగబడే వాళ్లపై మండి పడింది బాలీవుడ్ హాట్ హీరోయిన్ రిచా చద్దా. తమ మనోభావాలు అర్థం చేసుకోకుండా.. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పడు ఫొటోలు తీసే హక్కు ఎవరిచ్చారంటూ ఆమె ధ్వజమెత్తింది. సినీ తారలంటే పబ్లిక్ ఫిగర్లే తప్ప ప్రైవేటు ఆస్తులు కాదని ఆమె అంది. మా పరిస్థితి అర్థం చేసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయిలో ఇటీవల తన ఫొటోల కోసం కొందరు ఎగబడటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నేనేమైనా ఇండియా గేటునా.. రోడ్డు పక్కన నిలుచుంటే ఫొటోలు దిగడానికి అంటూ ఆమె మండిపడింది.
తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆమెకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో మందుల కోసం బయటికి వచ్చిన తనను ఇద్దరు యువకులు ఫొటోలు తీయడానికి ప్రయత్నించారని.. ఆ పరిస్థితుల్లో ఫొటోలు వద్దని వారించినా ఒప్పుకోలేదని.. తన పరిస్థితి అర్థం చేసుకోకుండా ఫొటోలు తీయడానికి ప్రయత్నించారని దీంతో తనకు ఒళ్లు మండిందని రిచా తెలిపింది. ఇంతకుముందు ఓ సందర్భంలో తన స్నేహితుడి తండ్రి చనిపోయాక ఓ హోటల్లో కలిశామని.. అక్కడ తామిద్దరం అతడి తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుని బయటికి వస్తుంటే.. ఆ సమయంలో ఫొటోల కోసం ఎగబడ్డారని రిచా తెలిపింది. తాము సెలబ్రెటీలైనప్పటికీ.. తమకూ ఎమోషన్లు ఉంటాయని.. అదేమీ పట్టించుకోకుండా సమయం సందర్భం లేకుండా ఫొటోల కోసం ఎగబడటం సరికాదని ఆమె హితవు పలికింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/