Begin typing your search above and press return to search.
ఈ జంట సహజీవనానికి నేటితో చెల్లు చీటీ
By: Tupaki Desk | 1 Oct 2022 3:31 AM GMTమీటూ ఉద్యమ ప్రహసనంలో కొన్ని వివాదాలు.. కొన్ని అద్భుత నట ప్రదర్శనలతో రిచా చద్దా పేరు నేషనల్ మీడియా హెడ్ లైన్స్ లో ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ హీరో అలీ ఫైజల్ తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ నిరంతరం వార్తల్లో నిలిచింది. ఇటీవల తనూశ్రీ దత్తా వివాదంలోను రిచా పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ హీరోల వేధింపుల వ్యవహారంపై మీటూలో గళం విప్పిన నటి రిచా. ఇదంతా ఇలా ఉండగానే రిచా చద్దా - అలీ ఫైజల్ ప్రేమాయణం వ్యవహారం మరో హైలైట్ గా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇప్పటికి ఈ జంట పెళ్లితో ఒకటవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ జంట వివాహానికి ముందు వారి దుస్తుల ఎంపిక కు సంబంధించిన స్నీక్ పీక్ వైరల్ గా మారింది.
రిచా సంప్రదాయ లుక్ లో అలీతో కలిసి ఎంతో ముచ్చటగా కనిపిస్తున్న రెండు ఫోటోలను పోస్ట్ చేసింది, ఆమె దానికి '#రిఅలీ 'మొహబ్బత్ ముబారక్' అని క్యాప్షన్ ఇచ్చింది. అలీ దానికి తన పేజీలో సమాధానమిస్తూ, '#రియాలీ తుమ్ కో భీ ..' అని క్యాప్షన్ ఇచ్చాడు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు రిచా-అలీ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు రిచా చద్దా ఢిల్లీలో తన మెహందీ ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసారు. రిచా-అలీ వివాహం అక్టోబర్ 6న గ్రాండ్ వెడ్డింగ్ వేడుకగా సాగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. రిసెప్షన్ అక్టోబర్ 7న ముంబైలో జరగనుంది. నిజానికి రిచా-అలీ వివాహం గురించి తమ ముందస్తు ప్రణాళికలను కూడా ప్రకటించారు. అయితే కోవిడ్ కొన్ని ఆటంకాలను సృష్టించడంతో ఇది ఆలస్యమైంది.
ఈ జోడీ చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ జంట ప్రస్థావించింది. ''కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత రెండేళ్ల క్రితం మేము మా వివాహం గురించి అధికారికం చేసాం. అప్పుడే మహమ్మారి మనందరినీ వెంటాడింది..'' అని రిచా చెప్పారు అని అలీ తెలిపారు. ఇతర దేశాల్లానే మనం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మనమందరం ఈ విశ్రాంతి విండోను ఆస్వాదిస్తున్నాం. మేము చివరకు మా కుటుంబాలు స్నేహితులతో వేడుకగా జరుపుకుంటున్నాం'' అని చెప్పారు. మాకు అందరి నుంచి ప్రేమ ఆశీర్వాదాలు దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది... అని అన్నారు. ''మీకు మా ప్రేమ తప్ప మరేమీ అందించడం లేదు.. ధన్యవాదాలు'' అంటూ ఈ జంట ఆనందం వ్యక్తం చేసింది.
రిచా చద్దా కెరీర్ జర్నీని పరిశీలిస్తే.. ఈ భామ బాలీవుడ్ లో బిజీ నటి. కెరీర్ ఆరంభమే ఫుక్రే సిరీస్ లో రిచా నటనకు చక్కని గుర్తింపు దక్కింది. ఓయే లక్కీ అనే కామెడీ చిత్రంతో చిన్న పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ 'లక్కీ ఓయ్!' అనే చిత్రంలోనూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2008లో చాలా సినిమాల్లో సహాయ నటిగా కనిపించింది. 18 డిసెంబర్ 1986న పంజాబ్ - అమృత్ సర్ లో రిచా జన్మించింది. రిచా తండ్రికి ఒక మేనేజ్ మెంట్ సంస్థ ఉంది. ఆమె తల్లి డాక్టర్. కుసుమ్ లతా చద్దా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని PGDAV కాలేజీలో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేసారు. కుసుమ్ రెండు పుస్తకాలను కూడా రచించారు. అంతేకాదు ఆమె గాంధీతో కలిసి పనిచేశారు. చద్దా ఢిల్లీలో పెరిగారు. 2002లో సర్దార్ పటేల్ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది. చద్దాకు ఏడాదిన్నర వయస్సు ఉన్నప్పుడు తన కుటుంబం ఢిల్లీకి వెళ్లింది.
రిచా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనలోని ఆధ్యాత్మికతను సైంటిఫిక్ భావజాలాన్ని కూడా వివరించింది. రిచా మాట్లాడుతూ..''నేను చాలా ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తిని. నేను శక్తిని.. ఒక రకంగా దేవుడిని నమ్ముతాను.సైన్స్ ఇంకా ప్రతిదానిని వివరించగలదని నేను అనుకోను. కానీ సైన్స్ గొప్పది'' అని అన్నారు. క్యాపిటల్ సిటీ దిల్లీలో ఎదగడం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. చద్దా నలుగురు సోదరులతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు.. ఎల్లప్పుడూ ఆమెకు చాలా స్వేచ్ఛను ఇచ్చారు. సినీ నటి కావాలనే తన ఆకాంక్షను నెరవేర్చేందుకు తన తండ్రి గారు ఎంతో అండగా నిలిచారు. ఐదేళ్ల వయసులోనే నటిని అవ్వాలనుకున్నాను. నా కుటుంబాన్ని నవ్వించేలా నటిస్తూ నేను నిజంగా ఆనందించాను అని రిచా ఇంటర్వ్యూలో తెలిపారు.
రిచా గత కొంతకాలంగా బాలీవుడ్ లో పాపులారిటీని పెంచుకుంది. తన అద్భుతమైన నటన .. విలక్షణమైన శైలితో పాపులరైంది. ఓయే లక్కీ- లక్కీ ఓయ్ (2008)- గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్- గోలియోన్ కి రాస్ లీలా రామ్ లీలా- మసాన్ సహా పలు చిత్రాలలో సహాయక పాత్రల్లో గొప్ప ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తన నటనకు అనేక అవార్డులను కూడా అందుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె ఒక సినిమా స్టాండింగ్ ఒవేషన్ ను అందుకుంది.
ఎంపికలు చాలా కీలకం. అవకాశం వస్తే నో చెప్పడం ఎప్పుడూ సులభం కాదు. అయితే చద్దా తన దారిలో వచ్చిన ఏదైనా వైవిధ్యమైన అవకాశాన్ని కాదనుకోలేదు. ''నో చెప్పడం కష్టం.. ఎందుకంటే డబ్బుకు నో చెప్పడం ఎప్పుడూ కష్టమే''అని కూడా రిచా అంటుంది. సరదాగా అనిపించే పాత్రలు ఏవైనా చేయాలని కోరుకుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.