Begin typing your search above and press return to search.

మ‌గాళ్ల త‌ప్పుల‌కు ఆడాళ్ల‌ను నిందిస్తారా? శిల్పాకు రిచా మ‌ద్ధ‌తు!

By:  Tupaki Desk   |   1 Aug 2021 4:40 AM GMT
మ‌గాళ్ల త‌ప్పుల‌కు ఆడాళ్ల‌ను నిందిస్తారా? శిల్పాకు రిచా మ‌ద్ధ‌తు!
X
అడల్ట్ ఫిల్మ్ రాకెట్ కేసులో భర్త రాజ్ కుంద్రా అరెస్టు కారణంగా శిల్పా శెట్టి ఇటీవ‌ల హెడ్ లైన్స్ లో నిలిచారు. నిన్న హన్సల్ మెహతా నుంచి శిల్పాకు మద్దతు ల‌భించింది. ఇప్పుడు రిచా చద్దా వంతు. మ‌గాళ్ల‌ తప్పులకు మహిళలను నిందించడం స‌రికాద‌ని రిచా చ‌ద్దా కౌంట‌ర్ ఎటాక్ చేశారు.

కొన్ని న్యూస్ పోర్టల్స్.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లపై శిల్పా దావా వేసిన కొన్ని రోజులకు హ‌న్స‌ల్.. రిచా స్పందించి ఆమెకు మ‌ద్ధ‌తుదారులుగా నిలిచారు. ఫిలింమేక‌ర్ హన్సల్ మెహతా శిల్పాకు మద్దతుగా ట్వీట్ చేశారు. కష్ట సమయాల్లో తన గౌరవాన్ని గోప్యతను కాపాడాల‌ని ప్రజలను కోరారు. మెహతా ట్వీట్ సారాంశం ఇలా ఉంది. ``మీరు శిల్పాశెట్టి కోసం నిలబడలేకపోయినా కనీసం వదిలివేయండి. చట్టం నిర్ణయించనివ్వండి. ఆమెకు కొంత గౌరవం.. గోప్యతను ఇవ్వండి. ప్రజా జీవ‌నంలో ప్రజలు చివరకు తమను తాము రక్షించుకోవడం ముఖ్యం. న్యాయం జరగకముందే దోషులుగా ప్రకటించడం దురదృష్టకరం`` అని వ్యాఖ్య‌ను జోడించారు.

కొంతకాలం క్రితం రిచా చద్దా శిల్పా శెట్టికి తన మద్దతును అందించిన సంగ‌తి తెలిసిన‌దే. అయితే ఆమె చట్టపరమైన సంక్షోభంలో చిక్కుకుంది. అయినా పురుషుల తప్పులకు మహిళలను నిందించే వారంతా స‌రికాద‌ని రిచా ట్వీట్ చేసింది. పురుషుల తప్పులకు మహిళలను నిందించడం ద్వారా ఒక జాతీయ క్రీడను రూపొందించాం. అలాంటివారిపై ఆమె దావా వేసినందుకు సంతోషంగా ఉంది`` అని రిచా వ్యాఖ్యానించారు. తప్పుడు ప్ర‌చారం.. హానికరమైన పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురించినందుకు అనేక న్యూస్ పోర్టల్స్ సోషల్ మీడియా వేదిక‌ల‌పైనా శిల్పాశెట్టి దావా వేసింది.

రిచా ట్వీట్ సంగ‌తి ఇదీ

హాట్ షాట్స్ అనే యాప్ లో అశ్లీల కంటెంట్ ఉత్పత్తి .. పంపిణీలో పాలుపంచుకున్నందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేసి పది రోజులకు పైగా అయ్యింది. కుంద్రాను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ముంబై పోలీసుల స్కానర్ నుండి శిల్పా తప్పించుకోకపోయినా.. ఈ రాకెట్ లో తన ప్రమేయం లేదా సంబంధం లేదని ఆమె ప్ర‌క‌టించారు. వయోజన చిత్ర కంటెంట్ నిర్మాణంలో తన భర్త రాజ్ కు ఎలాంటి ప్రమేయం లేదని కూడా ఆమె నొక్కి చెప్పింది. ఈ కేసును ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ కు అప్పగించారు. ప్ర‌స్తుతం లోతుగా విచార‌ణ సాగుతోంది.

కోట్లాది రూపాయ‌ల‌ బిజినెస్ ప్లాన్

రాజ్ కుంద్రా స్కాండ‌ల్ లో కొన్ని విస్తుపోయే విష‌యాల్ని పోలీసులు వెల్లడిస్తున్నారు. వయోజన (న్యూడ్) చలనచిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌ యాప్ ల‌తో భారీగా ఆదాయ ఆర్జ‌న‌ను కుంద్రా ప్లాన్ చేశార‌నేది ఆరోప‌ణ‌. ఏడాదికి రూ .34 కోట్లు చొప్ప‌న 2023-24 నాటికి 146 కోట్ల ఆర్జ‌న ల‌క్ష్యంగా కుంద్రా ప్లాన్ డిజైన్ చేశార‌ని ముంబై క్రైమ్ బ్రాంచ్ వెల్ల‌డించింది. రాజ్ కుంద్రా అతని సంస్థ `బాలీ ఫేమ్ మీడియా లిమిటెడ్` నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను ముంబై పోలీసులు వివరించారు. గత సంవత్సరం గూగుల్ ప్లేస్టోర్.. ఆపిల్ నుండి వయోజన చలనచిత్ర కంటెంట్ అనువర్తనం(యాప్) హాట్ షాట్ లను నిషేధించిన తర్వాత బాలీ ఫేమ్ యాప్ ని అమ‌ల్లోకి తెచ్చారు. 2023-24 నాటికి రూ.146 కోట్లు ఆర్జించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని.. సుమారు 34 కోట్ల రూపాయల ఏడాది నికర లాభం ఆర్జించాల‌ని ప్లాన్ చేశార‌ని ప్ర‌ముఖ‌ జాతీయ మీడియా క‌థ‌నం పేర్కొంది. ఇది 2021-22 ... 2022-23 సంవత్సరానికి రెట్టింపు చేయాల‌న్ని కుంద్రా టీమ్ అని క్రైమ్ పోలీసులు వెల్ల‌డించారు.

రాజ్ కుంద్రాకి చెందిన‌ హాట్ షాట్ యాప్ నిషేధించబడిన తరువాత కంటెంట్ బాలీ ఫేమ్ కు మార్చార‌ని క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది. సర్వర్ వివ‌రాలు స‌హా ఇత‌ర వివ‌రాల‌ను రాజ్ కుంద్రా కార్యాలయం నుండి వారాంతంలో అనేక ఫైళ్లు పత్రాల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. ప‌లువురు మోడ‌ల్స్ ఫిర్యాదుల‌ను క్రైమ్ బ్రాంచ్ ప‌రిశీలిస్తోంది. షెర్లిన్.. పూనమ్ పాండే.. మోడ‌ల్ జోయా.. ఇంకా తెలియ‌ని ఎన్నో పేర్లు ఈ కేసులో వినిపించాయి.