Begin typing your search above and press return to search.

అందుకోసమే షకీలా బిగ్రేడ్ సినిమాలు చేసింది: రిచాచద్దా

By:  Tupaki Desk   |   30 Dec 2020 9:12 AM GMT
అందుకోసమే షకీలా బిగ్రేడ్ సినిమాలు చేసింది: రిచాచద్దా
X
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో టాప్ శృంగారతారగా ఒక దశాబ్దం పైగా ఇండస్ట్రీని ఊపేసింది మల్లు బ్యూటీ షకీలా. సుమారు 250 సినిమాలకు పైగా నటించింది. షకీలా ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోలు సైతం తన సినిమాలకు భయపడేవారు. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ యాక్ట్రెస్ షకీలా మాత్రమే. హీరోయిన్‌ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీ వైపు అడుగులేస్తే.. ఆమెను శృంగారతార‌గా మిగిల్చింది ఇండస్ట్రీ. ఇదివరకే చాలాసార్లు ఆమె అడల్ట్ స్టార్ గా ఎందుకు మారిందో క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడామె జీవిత కథ ఆధారంగా బయోపిక్ రెడీ అయింది. ఇంద్ర‌జిత్ లంకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన షకీలా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా.. షకీలా రోల్ ప్లే చేసింది. షకీలా పాత్రలో పర్ఫెక్షన్ కోసం రిచా స్వ‌యంగా షకీలాను క‌లిసి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపింది.

తాజాగా రిచా చద్దా మాట్లాడుతూ.. షకీలా కావాలని బిగ్రేడ్ సినిమాలు చేయలేదని, కేవలం ఆర్థిక సమస్యల కారణంగా తన కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన ఆమె అలా చేసిందని చెప్పుకొచ్చింది. ఇదివరకే షకీలా మాట్లాడి.. ‘బయోపిక్‌కి సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. నిజాలు దాచుకుంటే.. ఇక బయోపిక్‌ తీయడమెందుకు..? ఇందులో సౌత్ ఇండియన్ స్టార్ హీరోల బాగోతాలు, రాసలీలలు, అసలు విషయాలు బయటపడతాయి. ఇక రిచాకి నాకు ఫిజికల్ సిమిలారిటి ఉంది. అంతేకాకుండా ఆలోచన విధానం కూడా మా ఇద్దరిదీ ఒకలానే ఉంటుంది. నా పాత్రకి న్యాయం చేస్తుందని నమ్ముతున్నా’ అని షకీలా తెలిపింది. ఇక ఇటీవలే బాలీవుడ్, మలయాళ బాషలలో విడుదలైన షకీలా బయోపిక్.. త్వరలో తెలుగులో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన షకీలా ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.