Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్స్ ఆఫర్స్ ఇచ్చి వారి గదికి రమ్మంటారు..!!
By: Tupaki Desk | 20 July 2020 1:30 AM GMTసినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నెపోటిజంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు.. ఇప్పుడు మిగతా అన్ని ఇండస్ట్రీలలో కూడా దీనిపై డిస్కషన్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి ఆఫర్స్ రాకుండా చేస్తుంటారని.. వారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇటీవల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా నెపోటిజంపై కామెంట్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను బయట పెడుతున్నారు. తాజాగా సుశాంత్ సింగ్ స్నేహితురాలు నటి రిచా చద్దా నెపోటిజం మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ చీకటి కోణాల గురించి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇండస్ట్రీలో రెండే వర్గాలు ఉన్నాయి.. ఒకటి జాలి ఉన్నవాళ్లు.. రెండు జాలి లేని వాళ్లు.. స్టార్ కిడ్స్ లో మంచివాళ్ళు కొందరున్నారు. అయితే కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో పాతుకుపోయి జాలిలేని కొందరు మాత్రం హీరోయిన్లను చాలా చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది రిచా చద్దా. సుశాంత్ మరణించిన నెల రోజుల తర్వాత సంతాపం ప్రకటించిన కొందరు దర్శకులలో నీచులు ఉన్నారు. హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చిన తర్వాత సదరు డైరెక్టర్స్ చెప్పినట్లు తమ గదికి రాకపోతే వారిపై తప్పుడు ప్రచారం చేసి.. తమ సినిమాల నుంచి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించింది. ఇక సుశాంత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరం థియేటర్ గ్రూప్ వర్క్ షాపుకు పనిచేసేవాళ్లమని.. రిహార్సల్స్ చేయడానికి సుశాంత్ నన్ను బైక్ మీద తీసుకెళ్లేవాడని చెప్పుకొచ్చింది రిచా చద్దా. రిచా వ్యాఖ్యలతో ఇప్పుడు ఇండస్ట్రీలోని నెపోటిజం లైంగిక వేధింపుల అంశాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.