Begin typing your search above and press return to search.
రిచా ట్వీట్ వివాదం: రెండుగా విడిపోయిన సినీ ప్రముఖులు..!
By: Tupaki Desk | 26 Nov 2022 3:30 PM GMTబాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా వివాదాస్పద ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 'గాల్వాన్ సేస్ హాయ్' అంటూ ఆమె చేసిన మూడు పదాల కామెంట్ చూట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వివాదంలో కొందరు రిచా పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. సినీ ప్రముఖులు రెండుగా చీలిపోయి ట్వీట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వాళ్ళకి (పాక్ ను ఉద్దేశించి) గట్టి సమాధానం చెప్తాం అని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటనను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేసారు. దీనికి రిచా స్పందిస్తూ.. 'గాల్వాన్ హాయ్ చెప్తోంది' అంటూ రీట్వీట్ చేసింది. ఇదే ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారుతోంది.
గతేడాది లద్ధఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో ఇండియా - చైనా దేశాల సైన్యాల మధ్య విధ్వంసకర ఘర్షణలు జరుగగా.. అందులో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇప్పుడు రిచా చద్దా.. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరులను.. సైన్యాన్ని అపహాస్యం చేస్తూ అలాంటి ట్వీట్ పెట్టిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆమె ట్వీట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
రీచా ట్వీట్ పై టాలీవుడ్ హీరో మంచు విష్ణు దీనిపై స్పందిస్తూ.. "అసలు ఆమెకు ఏమైంది? ఇలా ఎలా ఆలోచిస్తారు. సైనికులను మనం గౌరవించాలి. ఇలాంటి వారిని చూస్తే బాధగా ఉంటుంది" అని ట్వీట్ చేశారు. అలానే మరో హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా బాలీవుడ్ భామ ట్వీట్ ని తప్పు బట్టారు.
"20 మంది భారత సైనికులు గల్వాన్ వద్ద తమ ప్రాణాలు అర్పించారు. దేశాన్ని కాపాడటానికి వారి ప్రాణ త్యాగం గురించి తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను పక్కనపెట్టి మన సైన్యం, సాయుధ దళాలను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని అవమానించకూడదు. రిచా తెలుసుకోండి.. దేశం తర్వాతే ఏదైనా" అని నిఖిల్ ట్వీట్ చేశాడు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం రిచా చద్దాపై ఘాటు విమర్శలు చేశాడు. ఇది తనని ఎంతగానో బాధించిందని.. మన సాయుధ బలగాలకు కృతజ్ఞత చూపడానికి మించనదేమీ లేదని పేర్కొన్నాడు. వారు సరిహద్దుల్లో ఉండటం వల్లే మనం సురక్షితంగా జీవిస్తోన్నామని అక్షయ్ ట్వీట్ చేశారు.
అక్షయ్ కుమార్ ట్వీట్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. అక్షయ్ కుమార్ నుంచి ఇలాంటి రియాక్షన్ ను తాను ఊహించలేదని పేర్కొన్నాడు. "మీ నుండి ఇది ఊహించలేదు అక్షయ్ కుమార్ సార్.. మీ కంటే రిచా చద్దా మన దేశానికి సంబంధించినది సార్" అని ట్వీట్ చేశారు. అక్షయ్ కెనడా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడనే ఉద్దేశ్యంతో ప్రకాష్ రాజ్ వ్యగ్యంగా ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది.
రిచా చద్దా కు మద్దతుగా ట్వీట్ చేసినందుకు ప్రకాష్ రాజ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అర్బన్ నక్సల్ అంటూ విరుచుకుపడుతున్నారు. గాల్వన్ వ్యాలీ ఘటన కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉందని.. భారత సైన్యాన్ని అవహేళన చేసిన రీచా కు ఎలా సపోర్ట్ గా నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ సైతం రిచాకు మద్దతునిచ్చింది. మీకు మరింత బలం మరియు ప్రేమ చేకురాలి అని స్వర ట్వీట్ చేసింది. ఇలా రిచా చద్దా వివాదంలో ఇండస్ట్రీ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలిస్తే.. మరికొందరు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
నిజానికి వివాదం చెలరేగిన వెంటనే రిచా చాద్దా తన ట్వీట్ ని డిలీట్ చేసింది. క్షమాపణలు చెబుతూ ఓ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఎవర్నీ బాధించాలన్నది తన ఉద్దేశం కాదని.. అనుకోకుండా జరిగిన దానికి ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అని వేడుకుంది. తన తాత కూడా సైన్యంలో పనిచేశారని.. 1960 ఇండో-చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్ కూడా తగిందని చెప్పింది. ఆయన రక్తమే తనలోనూ ప్రవహిస్తోందని పేర్కొంది.
దేశాన్ని రక్షించేటప్పుడు ఒక సైనికుడు అమరవీరుడైనప్పుడు లేదా గాయపడినప్పుడు కుటుంబం మొత్తం ప్రభావితమవుతుంది. అది ఎలా ఉంటుందో తనకు వ్యక్తిగతంగా తెలుసని రిచా చడ్డా పేర్కొంది. ఏదేమైనా రిచా చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.