Begin typing your search above and press return to search.
హాలీవుడ్ నుంచి సిద్దు సినిమాకు విషెస్
By: Tupaki Desk | 6 Nov 2017 6:30 AM GMTబహుభాషా నటుడు సిద్దార్థ్ తమిళ్ హీరో అయినా కూడా టాలీవుడ్ లో తెలుగు హీరో అనిపించుకునేలా సినిమాలను చేశాడు. బాలీవుడ్ లోను ఇప్పటికి స్పెషల్ క్యారెక్టర్స్ వస్తే ఈ నటుడిని వాడుకోకుండా ఉండలేరు. అయితే గతంలో తెలుగులో సినిమాలను బాగా చేసిన ఈ లవర్ బాయ్ కొంత కాలానికి కనుమరుగైపోయాడు. చాలా రోజుల తర్వాత గృహం అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే ఈ సినిమా తెలుగు హిందీలో కూడా రూపొందింది. ఇప్పటికే తమిళ్ లో అవల్ టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంటోంది. చూసినవారంతా మంచి థ్రిల్ సినిమా అంటున్నారు. అయితే ఈ సినిమా లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుందని సినీ విమర్శకులు కూడా పాజిటివ్ కామెంట్స్ చేశారు. అలాగే హాలీవుడ్ ప్రముఖ సౌండ్ డిజైనర్ - ఆస్కార్ అవార్డు గ్రహీత రిచర్డ్ కింగ్ కూడా సినిమాను చూసి మంచి హారర్ సినిమా అని చిత్ర యూనిట్ ని ప్రశంసించారని హీరో సిద్దార్థ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
ముఖ్యంగా ఈ చిత్రం సౌండ్ డిజైన్ టీమ్ ను పొగిడినట్లు సిద్దార్థ్ చెప్పాడు. చాలా రోజుల తర్వాత తన సినిమాకు పాజిటివ్ కామెంట్స్ వస్తుండడంతో సిద్దార్థ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ సినిమా కథ రచయిత గాను సిద్దు వర్క్ చేశాడు. మిలింద రావ్ దర్శకత్వం వహించాడు. ఇక తెలుగులో ఈ నెల 10న సినిమా రిలీజ్ కానుంది.