Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: ‘రైట్ రైట్’
By: Tupaki Desk | 11 Jun 2016 9:09 AM GMTచిత్రం : ‘రైట్ రైట్’
నటీనటులు: సుమంత్ అశ్విన్ - ప్రభాకర్ - పూజా జవేరి - నాజర్ - తాగుబోతు రమేష్ - షకలక శంకర్ - రాజా రవీంద్ర - సుధ - ధన్ రాజ్ తదితరులు
సంగీతం: జె.బి
ఛాయాగ్రహణం: శేఖర్ వి.జోసెఫ్
మాటలు: డార్లింగ్ స్వామి
నిర్మాత: జె.వంశీ కృష్ణ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మను
‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో నటుడిగా తనేంటో రుజువు చేసుకోవడమే కాక.. సక్సెస్ కూడా రుచి చూసిన యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్లతో బాగా వెనుకబడిపోయాడు. ‘కొలంబస్’ దెబ్బకు బాగా డీలా పడిపోయిన సుమంత్.. ఈసారి మలయాళ రీమేక్ అయిన ‘రైట్ రైట్’ను నమ్ముకున్నాడు. కొత్త దర్శకుడు మను రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల్ని పలకరించింది. మరి ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.
కథ:
రవి (సుమంత్ అశ్విన్) పోలీస్ కావాలని ఆశపడి.. చివరికి ఆర్టీసీ బస్సులో కండక్టర్ జాబ్ తెచ్చుకుంటాడు. డ్రైవర్ శేషు (ప్రభాకర్)తో కలిసి రోజూ విజయనగరం నుంచి గవిటి అనే కొండ ప్రాంతానికి వెళ్లి వస్తుంటాడు. గవిటి గ్రామస్థులతో వీళ్లిద్దరికీ మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ ఊరికే చెందిన కళ్యాణి (పూజా జవేరి)ని ప్రేమిస్తాడు రవి. ఐతే వీళ్లిద్దరూ ఓసారి బస్సులో వస్తుండగా ఆ ఊరికి చెందిన మాస్టారు (నాజర్) కొడుకు అడ్డం పడి గాయాల పాలవుతాడు. తర్వాత అతను చనిపోయినట్లు తెలుస్తుంది. రవి-శేషులే యాక్సిడెంట్ చేసినట్లు బయటపడిపోవడంతో ఊర్లో వాళ్లంతా వాళ్లను కొట్టి పంపిస్తారు రవి జైలుకు వెళ్తాడు. ఐతే నిజానికి మాస్టారి కొడుకు బస్సు ఢీకొట్టడం వల్ల చనిపోలేదని.. దీని వెనుక వేరే కుట్ర ఉందని తర్వాత తెలుస్తుంది. ఆ కుట్ర ఏంటి.. దాన్ని రవి-శేషు ఎలా ఛేదించారు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘రైట్ రైట్’ మలయాళంలో ‘ఆర్డినరీ’ పేరుతో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమాకు రీమేక్. మలయాళం నుంచి అరువు తెచ్చుకున్న థ్రిల్లర్ సినిమా అంటే.. ‘దృశ్యం’ స్థాయిలో ఊహించుకుంటాం కానీ.. ‘రైట్ రైట్’ దానికి దరిదాపుల్లో కూడా ఉండదు. ‘రైట్ రైట్ ’ చూస్తున్నంత సేపూ ఇంత ‘ఆర్డినరీ’గా ఉన్న కథను ఎందుకు ఏరికోరి సుమంత్ అశ్విన్ రీమేక్ చేయాలనుకున్నాడు అన్న సందేహం కలుగుతుంది. రెండు గంటల తక్కువ నిడివి ఉన్నా కూడా ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందంటే.. ‘రైట్ రైట్’ కథనం ఎంత నెమ్మదిగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
‘రైట్ రైట్’ కథ 90ల్లో సాగేదేమీ కాదు. కానీ ఇందులో కథనం మాత్రం 90ల నాటి సినిమాల్నే తలపిస్తుంది. ఎంత మారుమూల పల్లెటూరు అయినా.. ఈ రోజుల్లో ఓ జిల్లా కేంద్రం నుంచి బస్సు ఉదయం బయల్దేరితే రాత్రికి అక్కడికి చేరడం.. మళ్లీ ఉదయం అక్కడ మొదలై రాత్రికి టౌనుకు రావడం.. పల్లెటూళ్ల నుంచి కూడా మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేస్తున్న రోజుల్లో ప్రధాన పాత్రల మధ్య ఉత్తరాల ద్వారా కమ్యూనికేషన్ సాగుతున్నట్లు చూపించడం.. ఓ వ్యక్తి కలకత్తాలో ఉంటూ కూడా ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇంటికి రావడం.. కుటుంబ సభ్యులతో అతడికి సరైన కమ్యూనికేషనే లేకపోవడం.. ఇవన్నీ చూస్తుంటే 20-30 ఏళ్ల ముందు సినిమాలే గుర్తుకొస్తాయి మరి.
పాత్రల పరిచయం దగ్గర్నుంచి అన్నీ చాలా నెమ్మదిగా సాగే ‘రైట్ రైట్’లో కథనం ఊపందుకోవడానికి చాలా సమయం పడుతుంది. పల్లెటూరి అందాల నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆహ్లాదం పంచినా.. ప్రథమార్ధంలో అసలు కథంటూ ఏమీ నడవదు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే మలుపు ఆసక్తి రేకెత్తించినా.. ద్వితీయార్ధంలో చిక్కుముడిని విప్పే విషయంలో ఉత్కంఠ ఏమీ లేదు. ఇంటర్వెల్ తర్వాతి నుంచి మిస్టరీని ఛేదించే క్రమంలో కథనం సాగుతుందని ఆశిస్తాం. కానీ అలా ఏమీ జరగదు.
ముందు హీరో అసలు విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం.. ఆ తర్వాత అది అనుకోకుండా బయటపడటం.. తర్వాత అతను జైలుకెళ్లడం.. ఇలాంటి నత్తనడకన సాగే డ్రామాతోనే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకో పావుగంటలో ఉండగా అసలు విషయం బయటపడుతుంది. ఐతే తెలుగు సినిమాల్లో ట్విస్టులనేవి ఇప్పుడు చిన్న విషయం అయిపోయాయి. దీన్ని మించి ట్విస్టులెన్నో చూశారు జనాలు. కాబట్టి అప్పటిదాకా ఉన్న నీరసమంతా పోగొట్టేసేంత బలం ఈ ట్విస్టుకు కానీ.. క్లైమాక్స్ కు కానీ లేకపోయింది. నరేషన్ అంతా పాత సినిమాల తరహాలోనే సాగడం ‘రైట్ రైట్’కు ఉన్న పెద్ద మైనస్ పాయింట్. ఛాయాగ్రహణం.. ఒకట్రెండు పాటలు.. కొన్ని కామెడీ సీన్స్.. పతాక సన్నివేశం సినిమాకు కొంచెం బలంగా నిలిచినా.. ఓవరాల్ గా మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
‘రైట్ రైట్’కు నటీనటులు బలంగా నిలిచారు. సుమంత్ అశ్విన్ నటుడిగా మరోసారి తన ప్రతిభ చూపించాడు. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో పరిణతితో నటించాడు. ప్రభాకర్ కూడా బాగా నటించాడు. అతడి బాడీ లాంగ్వేజ్.. డిక్షన్ శేషు పాత్రకు ప్లస్ అయ్యాయి. విలన్ పాత్రలో తమిళ నటుడు విలన్.. మాస్టారిగా నాజర్.. కీలకమైన పాత్రలో పావని బాగా నటించారు. ఐతే హీరోయిన్ పూజా జవేరి మాత్రం సినిమాకు పెద్ద మైనస్ అయింది. సుమంత్ అశ్విన్ పక్కన ఆమె అస్సలు సూటవ్వలేదు. అందం.. అభినయం రెండింట్లోనూ ఆమె నిరాశ పరిచింది.
సాంకేతికవర్గం:
టెక్నీషియన్స్ మంచి ఔట్ పుటే ఇచ్చారు. జె.బి. పాటల్లో టైటిల్ సాంగ్ తో పాటు వేల వేల కన్నుల్లోన.. కూడా బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. శేఖర్ వి.జోసెఫ్ ఛాయాగ్రహణం సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్. పల్లెటూరి వాతావరణాన్ని అందంగా ప్రెజెంట్ చేశాడు. డార్లింగ్ స్వామి డైలాగుల్లో పెద్ద మెరుపులేం లేవు. నిర్మాణ విలువలు పర్వాలేదు. కొత్త దర్శకుడు మను.. తొలి ప్రయత్నంలో ఏ ముద్రా వేయలేకపోయాడు. రీమేక్ కథను ఎంచుకున్న అతడు.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి.. కథను కొంచెం ట్రెండీగా.. ఉత్కంఠభరితంగా మార్చేందుకు ప్రయత్నించాల్సింది. ఈ తరం సినిమాలకు తగ్గ వేగం అతను చూపించలేకపోయాడు. ఉన్నదున్నట్లు దించేయడానికి ప్రయత్నించడంతో ఔట్ డేటెడ్ సినిమాలా తయారైంది ‘రైట్ రైట్’.
చివరగా: రైట్ రైట్.. ఈ జర్నీ మరీ స్లో గురూ
రేటింగ్- 2.25/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre