Begin typing your search above and press return to search.
సెన్సార్ బోర్డును ఉతికారేసిన హీరోయిన్
By: Tupaki Desk | 28 April 2018 12:44 PM GMTసెన్సార్ బోర్డు ద్వంద్వ ప్రమాణాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సినిమాల విషయంలో ఒక రకంగా.. మరికొన్ని సినిమాల విషయంలో ఇంకో రకంగా వ్యవహరిస్తూ ఉంటుందన్నది సెన్సార్ బోర్డు మీద వచ్చే ప్రధానమైన కంప్లైంట్. కొన్ని సినిమాల్లో బూతులున్నా.. హీరోయిన్లు అతిగా ఎక్స్ పోజింగ్ చేసినా వదిలేస్తుంటారు. కానీ కొన్ని సినిమాల్ని పట్టి పట్టి చూసి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే చాలామంది సెన్సార్ బోర్డు తీరును దుయ్య బట్టారు. తాజాగా మలయాళ హీరోయిన్ రీమా కళింగల్ సెన్సార్ బోర్డును ఉతికారేసింది. తాను నటించిన ‘అభాషం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ చిత్రంలో నటుడు సెరజెట్టన్ తొడలు చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందట. ఐతే ఇదే నటుడు ‘పులిమురగన్’ సినిమాలో కూడా తొడలు చూపించాడట. కానీ ఆ సినిమా విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని.. కానీ తమ సినిమాకు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని.. ఇదెక్కడి న్యాయమని రీమా ప్రశ్నించింది. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా నిబంధనలు మారిపోతాయని.. సెన్సార్ బోర్డు హిపోక్రసీకి ఇది రుజువని.. సమాజంలో జరిగే ఒక ఘటనను సినిమా ద్వారా చెప్పకపోతే ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్థం ఏముందని ఆమె ప్రశ్నించింది. ‘అభాషం’ సినిమాలో హింస లేదని.. అశ్లీలం లేదని.. కానీ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తామన్నారని.. సెన్సార్ బోర్డు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె అభిప్రాయపడింది. ఈ చిత్రం మే 4న రిలీజ్ కావాల్సిఉంది