Begin typing your search above and press return to search.

49 రోజుల‌కు 2.25 కోట్లు ఆఫర్ చేశార‌న్న‌ బిగ్ బాస్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   22 March 2021 12:30 AM GMT
49 రోజుల‌కు 2.25 కోట్లు ఆఫర్ చేశార‌న్న‌ బిగ్ బాస్ బ్యూటీ!
X
మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `అంద‌రివాడు` (2004) చిత్రంలో న‌టించింది రిమ్మీ సేన్. త‌న‌దైన అందం అభిన‌యంతో తొలి ప్ర‌య‌త్న‌మే ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ తెలుగు ప‌రిశ్ర‌మ‌లో నీ తోడు కావాలి.. ఇదే నా మొద‌టి ప్రేమ లేఖ చిత్రాలలో కూడా న‌టించింది.

బాలీవుడ్ లోనూ చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. గోల్‌ మాల్: ఫన్ అన్ ‌లిమిటెడ్- హంగమా- గరం మసాలా- ధూమ్ - బాగ్ ‌బాన్ లాంటి ఫ‌న్నీ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ల‌లో న‌టించింది. అయితే ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రిమ్మీ కెరీర్ ఆశించినంత పెద్ద స్థాయికి చేరుకోలేదు. స్వ‌ల్ప వ్య‌వ‌థిలో న‌టించి ఆ త‌ర్వాత తెర‌కు దూర‌మైంది. తెలుగు-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో నటించినా ఆశించినంత గుర్తింపు ద‌క్క‌లేదు.

ఆ క్ర‌మంలోనే రిమ్మీ 2015 లో హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో తొమ్మిదవ సీజన్లో క‌నిపించింది. బిగ్ బాస్ లో పాల్గొనడానికి తనను ఆకర్షించిన అస‌లు కార‌ణంపై రిమ్మీ ఇన్నాళ్ల‌కు ఓపెనైంది. నిజానికి బిగ్ బాస్ లో క‌నిపించి పేరు తెచ్చుకోవాల‌ని చాలామంది అనుకుంటారు. కానీ తాను మాత్రం డ‌బ్బు కోసం మాత్ర‌మే షోలో పాల్గొన్నాన‌ని తెలిపారు. త‌న‌కు 2.25 కోట్ల‌ను ఆఫ‌ర్ చేశార‌ని.. కేవ‌లం 49 రోజుల్లో అంత పెద్ద మొత్తం అందుకున్నాన‌ని తెలిపారు. అంత తక్కువ స‌మ‌యంలో భారీ మొత్తాన్ని ఆర్జించ‌డం సులువేమీ కాద‌ని అన్నారు.

బిగ్ బాస్ అనేది మ‌న‌లో దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని బ‌య‌టికి తెచ్చే ఒక రియాలిటీ వేదిక‌. ఇక్క‌డ గేమ్ నిజాయితీగా ఆడాలి. మ‌న‌ల్ని మ‌నం ఆవిష్క‌రించుకోవాలి. చెడును వెద‌జ‌ల్లినా శాంతంగా ప్ర‌తిదీ నెగ్గాలి.. అని రిమ్మీ అన్నారు. బిగ్ బాస్ ఉద్దేశపూర్వకంగా పనులను సృష్టిస్తారని.. అయినా మీ మీద పట్టు కలిగి ఉండాల‌ని రిమ్మీ త‌న అనుభ‌వాల్ని చెప్పారు.