Begin typing your search above and press return to search.

RIP లతాజీ: చిరంజీవి- మహేష్ -ఎన్టీఆర్ సంతాపం

By:  Tupaki Desk   |   6 Feb 2022 2:30 PM GMT
RIP లతాజీ: చిరంజీవి- మహేష్ -ఎన్టీఆర్ సంతాపం
X
భార‌త‌దేశ‌పు గాన‌కోకిల‌.. లెజెండ‌రీ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ మృతి అభిమానులు జీర్ణించుకోలేనిది. హిందీ చిత్ర‌సీమ స‌హా దాదాపు 35 భాష‌ల్లో ల‌తాజీ పాట‌లు పాడారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఆఖ‌రిపోరాటం స‌హా ప‌లు చిత్రాల‌కు పాడారు. ఆమె గానామృతానికి ప‌ర‌వశించ‌ని తెలుగు సినీ ప్ర‌ముఖుడు లేరు. అందుకే లతాజీ మ‌ర‌ణించార‌ని తెలియ‌గానే అంద‌రూ విషణ్ణ‌వ‌ద‌నాల‌తో సంతాపం ప్ర‌క‌టించారు.

చిరంజీవి- మహేష్ బాబు- ఎన్టీఆర్ - రాజ‌మౌళి- రామ్ చ‌ర‌ణ్ స‌హా ప‌లువురు స్టార్లు ఈ విచారకరమైన మరణానికి సంతాపం తెలిపారు. ది నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ప్రముఖ గాయని అనేక అవార్డులను గెలుచుకున్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న గ్రహీత కూడా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని అంతా కోరుకున్నారు.

చిరంజీవి: నైటింగేల్ ఆఫ్ ఇండియా.. గ్రేటెస్ట్ లెజెండ్స్ లో ఒకరైన #లతా దీదీ ఇక లేరు. గుండె పగిలిన భావ‌న‌. ఈ భారీ నష్టం కారణంగా ఏర్పడిన లోటు ఎప్పటికీ తీర్చ‌లేనిది. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది. ఆమె సంగీతం సజీవంగా ఉంటుంది. సంగీత ప్ర‌పంచంలో ఎప్ప‌టికీ అద్భుతంగా త‌న గానం నిలుస్తుంది. శాంతిగా స్వ‌ర్గంలో విశ్రాంతి తీసుకోండి #లతామంగేష్కర్ జీ.

ఎస్.ఎస్.రాజ‌మౌళి: లతా జీ మరణం తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటుంది. భారతదేశపు నైటింగేల్ కు నా హృదయపూర్వక నివాళి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులకు బలం ..సౌఖ్యాన్ని కోరుకుంటున్నాను.

జూ.ఎన్టీఆర్: లతాజీ మరణించినందుకు చాలా బాధపడ్డాను. నిజంగా దేశానికి ఇది తీరని నష్టం. మెలోడీ క్వీన్ మన హృదయాలలో మనస్సులలో రాజ్యమేలుతూనే ఉంటారు. నేటి తరం గాయకులకు ల‌తాజీ ఎంతో స్ఫూర్తినిచ్చారు.

మహేష్ బాబు: తరతరాలుగా భారతీయ సంగీతాన్ని నిర్వచించిన స్వరం... ఆమె వారసత్వం నిజంగా అసమానమైనది. కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు ల‌తాజీ అభిమానులందరికీ హృదయపూర్వక సానుభూతి. శాంతంగా ఇక‌ విశ్రాంతి తీసుకోండి లతా జీ. మీలా మరొకటి ఉండరు.


సాయి ధరమ్: తేజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియాకు హృదయపూర్వక నివాళులు. “లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న గాత్రం #లతామంగేష్కర్ గారి ఆకస్మిక మరణం క‌ల‌చివేసింది. మీ పాటలతో ఎల్లప్పుడూ గుర్తుంటారు. చిరస్థాయిగా .. స్వ‌ర్గంలో విశ్రాంతి తీసుకోండి. ఆమె కుటుంబానికి .. ప్రియమైనవారికి బలాన్నిద్దాం.

బాలీవుడ్ నుంచి ప‌లువురు ల‌తాజీకి సంతాపం తెలియ‌జేసారు.

అక్షయ్ కుమార్: మేరీ ఆవాజ్ హాయ్ పెహచాన్ హై.. గర్ యాద్ రహే… అలాంటి స్వరాన్ని ఎలా మర్చిపోగలం! లతా మంగేష్కర్ జీ మరణించినందుకు చాలా బాధపడ్డాను. నా ప్రగాఢ సానుభూతి .. ప్రార్థనలు. ఓం శాంతి..

అజయ్ దేవగన్: ఎప్పటికీ చిహ్నం. ఆమె పాటల వారసత్వాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. లతాజీ పాటలు వింటూ పెరిగిన మనం ఎంత అదృష్టవంతులమో. ఓం శాంతి. మంగేష్కర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

హన్సిక: స్వర్ణయుగానికి హృదయ విదారకమైన ముగింపు. ఆమె కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఆమె వారసత్వం & స్వరం మనతోనే ఉంటుంది. రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. నా ప్రగాఢ సానుభూతి #లతామంగేష్కర్ జీ.