Begin typing your search above and press return to search.
రైజ్.. రూల్.. రాంపేజ్
By: Tupaki Desk | 12 Jan 2022 3:57 AM GMTదాదాపుగా రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని కరోనా వల్ల సుకుమార్ పుష్ప తో.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో అడ్డంగా బుక్ అయ్యారు. సుకుమార్ అయినా పుష్ప ఒక పార్ట్ ను తీసి ఏదోలా వదిలేశాడు. పార్ట్ 2 పనులు మొదలు పెట్టబోతున్నాడు. కాని విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా లైగర్ వద్దే ఆగి పోయాడు. దాంతో వీరిద్దరి కాంబోలో మూవీ పట్టాలెక్కక పోవచ్చు.. ఇద్దరి కాంబో సినిమాను మనం చూడక పోవచ్చు అనే అభిప్రాయంకు జనాలు వచ్చేశారు. మెల్ల మెల్లగా వీరి కాంబో సినిమా గురించి చర్చించుకోవడం మానేస్తున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ వీరి కాంబో సినిమా గురించి మీడియాలో పతాక స్థాయిలో వార్తలు వచ్చేలా చేసింది రౌడీ స్టార్ ట్వీట్.
సుకుమార్ పుట్టిన రోజు సందర్బంగా విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు చెప్పాడు. అదే సమయంలో సుకుమార్ తో వర్క్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో 2021 - రైజ్.... 2022 - రూల్.... 2023 - రాంపేజ్ అంటూ ట్వీట్ చేశాడు. అంటే 2021 లో పుష్ప ది రైజ్ సినిమా తో సుకుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక 2022 లో పుష్ప ది రూల్ అనే టైటిల్ తో సినిమాను సుకుమార్ ఏడాది చివర్లో తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2023 లో తపతో రాంపేజ్ అంటే విద్వంసం చేయడానికి సుకుమార్ సిద్దంగా ఉన్నాడంటూ ఆసక్తికరంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
పుష్ప రెండవ పార్ట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. కాని విజయ్ దేవరకొండ ట్వీట్ చూస్తుంటే ఇదే ఏడాదిలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అయితేనే వచ్చే ఏడాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఆగస్టు లో లైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మధ్యలో శివ నిర్వాన దర్శకత్వంలో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. మరి శివ నిర్వాన సినిమాను పూర్తి చేసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రౌడీ స్టార్ నటిస్తాడా లేదంటే శివ నిర్వాన సినిమా ను పక్కకు పెట్టి తర్వాత చేసి ముందు సుకుమార్ సినిమాను చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి సుకుమార్ పుట్టిన రోజు సందర్బంగా రౌడీ స్టార్ చేసిన ట్వీట్ తో ఇద్దరి కాంబో ట్రీట్ అయితే ఉంది కాని కాస్త ఆలస్యంగా ఉంటుందని.. అది ఒక విధ్వంసకర మూవీగా ఉంటుందని రౌడీ స్టార్ చెప్పుకొచ్చాడు.