Begin typing your search above and press return to search.

ఆమెను బ్లాక్‌ చేసిన స్టార్‌ క్రికెటర్‌

By:  Tupaki Desk   |   13 Jan 2020 8:48 AM GMT
ఆమెను బ్లాక్‌ చేసిన స్టార్‌ క్రికెటర్‌
X
ఈమద్య కాలంలో బ్రేకప్‌ కు ప్రేమలో పడినంత కాలం పట్టడం లేదు. ప్రేమలో ఉన్నన్ని రోజులు పబ్‌ లు పార్టీలు అంటూ తెగ తిరిగేస్తూ ఏదో ఒక చిన్న కారణం వల్ల బ్రేకప్‌ చెప్పుకుంటున్నారు. ఇలాంటి బ్రేకప్‌ వార్తలు మనం ఎక్కువగా బాలీవుడ్‌ లో వింటూ ఉంటాం. బాలీవుడ్‌ సెలబ్రెటీలు ఎంతో మంది ప్రేమలో పడటం మరియు బ్రేకప్‌ చెప్పుకోవడం చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. ఇక బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తో స్టార్‌ క్రికెటర్స్‌ లవ్‌ అఫైర్స్‌ గురించి కూడా మనం ఎప్పటి నుండో వార్తలు వింటూనే ఉన్నాం.

ఎంతో మంది స్టార్‌ క్రికెటర్స్‌ హీరోయిన్స్‌ ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కూడా యువ క్రికెటర్లు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలతో ప్రేమలో మునిగి తేలుతున్నారు. యువ క్రికెటర్‌ పంథ్‌ ప్రస్తుతం ఇషా నెగీతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. గతంలో ఈయన ఊర్వశి రౌతెలాతో పార్టీలకు పబ్‌ లకు కలిసి తిరిగేవాడు. దాంతో ఇద్దరి మద్య ప్రేమాయణం నడుస్తుందని అంతా భావించారు. కాని అది కేవలం స్నేహం మాత్రమే అని.. పంథ్‌ ప్రస్తుతం ఇషాతో ప్రేమ లో ఉన్నట్లు గా ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఇక ఇదే సమయం లో పంథ్‌ మరియు ఊర్వశిల గురించి ఒక ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వీరిద్దరు కూడా వాట్సప్‌ లో ఒకరిని ఒకరు బ్లాక్‌ చేసుకున్నారట. పంథ్‌ కు మళ్లీ దగ్గర అయ్యేందుకు ఊర్వశి ప్రయత్నిస్తుందని ఆ కారణంగానే పంథ్‌ ఆమె వాట్సప్‌ నెంబర్‌ ను బ్లాక్‌ చేశాడట. పంథ్‌ తన నెంబర్‌ బ్లాక్‌ చేశాడనే కోపంతో ఊర్వశి కూడా అతడి నెంబర్‌ ను బ్లాక్‌ చేసిందట అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి పంథ్‌ పూర్తిగా ఇషా నెగీతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు.