Begin typing your search above and press return to search.

రిషి కపూర్ సాబ్ అప్పుడు అన్నట్టే జరిగిందే!

By:  Tupaki Desk   |   2 May 2020 6:30 AM GMT
రిషి కపూర్ సాబ్ అప్పుడు అన్నట్టే జరిగిందే!
X
మునుపటి తరం రొమాంటిక్ హీరో.. సీనియర్ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఏప్రిల్ 30 వ తారీఖున తనువు చాలించిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఫ్రెండ్స్.. ఆయన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా అయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే రిషి నటించిన సినిమాల వీడియోలు.. ఆయన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆయనను అభిమానించేవారు ఎంతో మంది కడసారి చూపుకు నోచుకోలేకపోయారు.

లాక్ డౌన్ నిబంధనల కారణంగా అంత్యక్రియలకు 20 మంది మాత్రమే పాల్గొనాలి. దీంతో రక్త సంబంధీకులు.. అత్యంత సన్నిహితులు ఒకరిద్దరికి మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రిషి కపూర్ 2017 లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా 2017 లో ఏప్రిల్ 27 న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు ఒకరిద్దరు తప్ప ఈ తరం బాలీవుడ్ స్టార్లు హాజరు కాలేదు. ఆ విషయం రిషి కపూర్ కు ఆగ్రహం తెప్పించింది. తన ట్విట్టర్ ద్వారా "ఇది అవమానం. ఈ తరానికి చెందినా ఒక్క నటుడు కూడా వినోద్ ఖన్నాఅంత్యక్రియలకు హాజరు కాలేదు. కనీస్యం ఆయనతో పనిచేసినవారు కూడా హాజరు కాలేదు. మనుషులను గౌరవించడం నేర్చుకోవాలి" అంటూ నిప్పులు చెరిగారు. మరో ట్వీట్ లో "ఇదొక్కటే కాదు. రేపు నాకైనా ఇలానే జరుగుతుంది. తర్వాత ఇంతే. నేను చనిపోతే దీనికి సిద్ధంగా ఉందాలి. ఎవరూ నన్ను భుజాల మీద మోయరు. ఈ స్టార్ల మీద నేను ఈరోజు చాలా కోపంగా ఉన్నాను" అంటూ గట్టిగా అందరికీ చురకలు అంటించాడు.

సాధారణమైన పరిస్థితుల్లో చాలామంది బాలీవుడ్ స్టార్లు రిషి కపూర్ అంత్యక్రియలకు హాజరై ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం లాక్ డౌన్ కారణంగా ఎవరైనా హాజరవుదామని అనుకున్నా వీలు కాలేదు. ఆయన మూడేళ్ళ క్రితం తన ట్వీట్ లో చెప్పిందే జరిగిందని నెటిజన్లు అంటున్నారు.