Begin typing your search above and press return to search.

రిషి కపూర్‌కు మద్దతివ్వాలా....? వ్యతిరేకించాలా...?

By:  Tupaki Desk   |   20 March 2015 9:30 AM GMT
రిషి కపూర్‌కు మద్దతివ్వాలా....? వ్యతిరేకించాలా...?
X
గోమాంసం విక్రయించడం... గోమాంసాన్ని కలిగిఉండడాన్ని మహారాష్ట్రలో నిషేధించడంతో వ్యతిరేకత ఎదురవుతోంది. గోమాంసం విక్రయించినా, ఎవరిదగ్గరైనా ఉన్నా వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా తప్పదు. ఈమధ్యే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం దొరకడంతో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఆలస్యం లేకుండా దీన్ని అమలులోకి తెచ్చింది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, శిక్షల్లోనే కాస్త తేడా. హర్యానాలో ఈ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష.. రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.

అయితే మహారాష్ట్రలో అమలు చేస్తున్న ఈ చట్టంపై అక్కడి ప్రముఖులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ ఒకప్పటి హీరో రిషికపూర్‌ అయితే ఏకంగా బహిరంగంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టి మరీ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను హిందువునే కానీ... గోమాంసం తింటానని.. అలా అని తనకు భక్తి లేదా.. హిందూత్వాన్ని విశ్వసించనా...? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

మారుతున్న కల్చర్‌లో భాగంగా కులమతాలతో సంబంధం లేకుండా మాంసాహారం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా మార్పులచ్చిన సత్యాన్ని ఎవరూ కాదనలేం.. నగరాల్లో ప్రజలు.. ఉన్నతవర్గాల్లో అన్ని రకాల మాంసాహారాన్ని తీసకుంటున్నవారు ఉంటున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆగహ్రం వ్యక్తమవుతోంది. అయితే, రిషికపూర్‌లా అందరూ బయటపడలేకపోయినా చాలామందిలో ఇదే అభిప్రాయం ఉన్నట్లు అర్థమవుతోంది.

అయితే, కల్చర్‌ ఎంత స్పీడవుతున్నా సంప్రదాయాలు... విశ్వాసాలు, మతాచారాలను పాటించాల్సిన అవసరమూ కనిపిస్తోంది. లేకుంటే మూలాలు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. బీజేపీ పాలనలో ఈ చట్టాన్ని ఎన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయో.. ఇంకెన్ని వివాదాలు, అసంతృప్తులు, ఆగ్రహాలు వస్తాయో రానురాను చూడాల్సిందే.

కాబట్టి రిషికపూర్‌ లాంటివాళ్ల వాదనకు మద్దతు పలకాలో... వ్యతిరేకించాలో సమాజమే నిర్ణయించాలి. మంచీచెడులను బేరీజు వేసుకుని చట్టాలను.. సంప్రదాయాలను రెండింటినీ గౌరవించాల్సిన అవసరం కనిపిస్తోంది.