Begin typing your search above and press return to search.

ఆయనేదో జోకేస్తే జనాలకేంటి?

By:  Tupaki Desk   |   30 July 2015 4:24 PM GMT
ఆయనేదో జోకేస్తే జనాలకేంటి?
X
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ చాలా సరదా మనిషి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పెద్దాయన తన కొడుకు సినిమాల మీద కూడా ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేస్తుంటాడు. జోకులేస్తుంటటాడు. అతడి సినిమా ఒక్కటీ తనకు నచ్చదని నిర్మొహమాటంగా చెప్పాడోసారి. తాజాగా హీరోయిన్ హ్యూమా ఖురేషి మీద ఆయనో సరదా కామెంట్ చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా విష్ చేస్తూ.. ‘‘నువ్వెంత బరువెక్కితే నిన్ను కిడ్నాప్ చేయడం అంత కష్టం. కేక్ తిను. భద్రంగా ఉండు’’ అని ట్వీట్ చేశాడు రిషి కపూర్. హ్యూమా మిగతా బాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం బొద్దుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కొంచెం సరదాగా ఈ ట్వీట్ చేశారు రిషికపూర్.

డి-డే సినిమాలో రిషి కపూర్ తో కలిసి నటించింది హ్యూమా. వాళ్లిద్దరికీ మంచి పరిచయముంది. ఆ చనువుతోనే సరదాగా కామెంట్ చేశాడు రిషి. వాటిని హ్యూమా కూడా సరదాగానే తీసుకుంది కానీ.. తన అభిమానులకు మాత్రం కోపం వచ్చేసింది. అయినా అమ్మడికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏమీ లేదు. ఫ్యాన్స్ అని చెప్పుకునే కొందరు జనాలు రిషి సంస్కార హీనుడంటూ విరుచుకుపడ్డారు. ఆయన్ని తిట్టిపోశారు. దీంతో రిషి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ‘‘మన్నించమని అడుగుతున్నా. నేను హ్యూమా పుట్టిన రోజు సందర్భంగా ఆమె మీద వ్యక్తిగతంగా జోక్ వేశాను. అది చూసి జనాలు బాధపడి ఉంటే.. నా ట్వీట్ ను వెనక్కి తీసుకుంటున్నా’’ అని చెప్పారు. దీనిపై హ్యూమా స్పందిస్తూ.. ‘‘నా ఫేవరెట్ కోస్టార్ నాకు ప్రేమగా విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అదో జోక్. సరదాగా తీసుకోండి యార్’’ అంటూ వాతావరణాన్ని కూల్ చేసే ప్రయత్నం చేసింది.