Begin typing your search above and press return to search.

అయ్యో రిషి.. అలా ఇరుక్కున్నాడే!!

By:  Tupaki Desk   |   28 Aug 2017 4:22 AM GMT
అయ్యో రిషి.. అలా ఇరుక్కున్నాడే!!
X
సీనియర్ యాక్టర్ రిషి కపూర్ సోషల్ మీడియాలో మహా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. అయితే.. ఎంత యాక్టివ్ అయినా చట్టం గురించిన కనీస అంశాలను తెలుసుకోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. రిషి కపూర్ తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ఓ పోస్ట్ కారణంగా.. పోలీసు కేసు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో ఒకదాన్ని.. తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశాడు రిషి కపూర్. ఏటీఎంలో ఓ అమ్మాయి మనీ డ్రా చేస్తుండగా.. వెనుకాల ఓ చిన్నపిల్లాడు నుంచుని ఉంటాడు. మధ్యలో ఓ కుర్రాడు వచ్చి దూరితే.. ఆ అమ్మాయి వెనక నుంచి తడతాడు పిల్లాడు. దీంతో ఆ కుర్రాడే తనను టచ్ చేశాడని భావించి చెడామడా పీకేస్తుందా అమ్మాయి. ఈ వీడియో వాట్సాప్ లో బాగానే చక్కర్లు కొడుతుండగా.. ఈ వీడియో నచ్చేసిన రిషి కపూర్.. దాన్నే పోస్ట్ చేసి స్మార్ట్ పిల్లాడు అన్న అర్ధం వచ్చేలా కామెంట్ పెట్టాడు. కానీ అసలు సమస్యంతా అక్కడే వచ్చింది. ఈ పోస్ట్ చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉందంటూ ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున పోలీసు కేసు నమోదైంది..

రిషి కపూర్ కి 26 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారని.. అంటే ఇంతమందికి రిషి కపూర్ చైల్డ్ పోర్నోగ్రఫీని సపోర్ట్ చేస్తున్నట్లు చెబుతున్నట్లే అని ఈ కేసు సారాశం. పైగా ఈ పోస్ట్ కు విపరీతంగా షేర్లు.. లైకులు వస్తుండడాన్ని కూడా కేసులో ప్రస్తావించారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెన్ యాక్ట్.. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రిషి కపూర్ మీద కేసు సంగతి సరే కానీ.. అడ్డమైన వీడియోలను తెగ ఫార్వార్డ్ చేసేసే జనాలు కూడా.. గ్రూప్ లలో పోస్ట్ లు షేర్ చేసే ముందు ఎలర్ట్ గా ఉండాలనే విషయాన్ని ఈ కేసు తెలియచేస్తుంది. ఆ గ్రూపులో ఒక్కడు కేసు పెట్టినా.. పోస్ట్ చేసిన వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి.