Begin typing your search above and press return to search.
అదేం పోలిక రిషీ??
By: Tupaki Desk | 24 Nov 2017 5:43 AM GMTసోషల్ మీడియాలో ఏదైనా అంశంపై రెస్సాన్స్ చేసేటప్పుడు కాస్త మంచి..చెడూ దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అనిపించింది కదా తోచిన పోలికేదో చెప్పి.. ఇష్టమొచ్చిన కామెంట్లు పెడితే చివరకు అన్నింటా విమర్శలే ఎదుర్కోవాల్సి వస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తాజాగా చేసిన ఓ కామెంట్ ను చూసిన నెటిజన్లు ఆయన్ను తిట్టిపోస్తున్నారు.
ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న అమెరికన్ పాప్ స్టార్ బియాన్సే ఎరుపు రంగు గౌనులో తలపై పూలు పెట్టుకుని దిగిన ఫొటోను రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోని రిషీకపూర్ ఓ ఫ్లవర్ వాజ్ తో పోల్చాడు. అంతటితో ఆగకుండా తన పాత సినిమా టైటిల్ ను గుర్తు చేస్తూ ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ అంటూ బియాన్సే పై కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ చూసిన నెటిజన్లంతా ఆయనపై తెగ ఫైరయ్యారు. ఓ నిండు గర్భిణీ పై ఆ కామెంట్లేంటి.. మందు కొట్టి ఉన్నారా అంటూ కామెంట్లతో దండయాత్ర చేశారు.
రిషి కపూర్ వివాదాస్పద కామెంట్లతో నెటిజన్ల ఆగ్రహం ఎదుర్కోవడం ఇది మొదటిసారేమీ కాదు. ఇంతకు ముందు అప్పట్లో హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ ఫొటోను పోస్ట్ చేసి ‘అవి దుస్తులా.. లేక ఉల్లిపాయ మూటలా’ అంటూ సెటైర్ వేశారు. అప్పుడు కూడా నెటిజన్లు ఆయన పై తిట్ల్ల వర్షం కురిపించారు. తండ్రి పాత్రల నుంచి తాత పాత్రలకు షిఫ్టవుతున్న ఏజ్ లో ఇలాంటి కామెంట్లు రిషీ కపూర్ కు అవసరమా?