Begin typing your search above and press return to search.
తీవ్రవాదులకు ఎందుకు విష్ చేయడం?
By: Tupaki Desk | 15 Aug 2017 8:11 AM GMTపుట్టుకుతోనే ఎవరితో స్నేహం ఉండదు ఎవరితోనూ వైరము ఉండదు కానీ మన దేశ విభజనతో అది జరిగినట్లు కనిపిస్తుంది. దేశం రెండుగా చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయాన మనం మాత్రం ఇంకా పూర్తి స్నేహంగా మెలగలేకపోతున్నం. ఒక సమస్య పోతే మరొకటి వస్తూనే ఉంది ఈ రెండు దేశాలు మధ్య. ఇప్పుడు దేశం మొత్తం మన జాతి నాయకులు మనకు ఇచ్చిన స్వేచ్చను గుర్తు చేసుకుంటూ ఇండిపెండెన్స్ డే ని పండుగలా జరుపుకుంటున్నం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక బాలీవుడ్ నటుడు ఇచ్చిన సందేశానికి అంతటా చర్చలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా పాకిస్తాన్ కు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పినందుకు న్యూస్ గా మారాడు. రిషీ కపూర్ మేసెజ్ ఏంటంటే “ నా పాకిస్తాన్ మిత్రులకు అక్కడ ప్రజాలకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం ఇక ముందైనా శాంతితో స్నేహం తో కలిసి ఉందాం” అని అన్నాడు. దీనికి మన సోషల్ మీడియా ప్రజలు కొంతమందికి నచ్చితే మరి కొంతమందికి నచ్చలేదు. ఒకరు అన్నది ఇలా ఉంది “ ఇలా విష్ చేయడం వలన ఈ దేశాలు మధ్య ఉండే దూరం తగ్గుతుంది శాంతి పుడుతుంది” అని చెప్పితే మరోకరు ఏమో ‘ఆ తీవ్రవాదులకు ఎందుకు విష్ చేయడం’ అని మండిపడ్డాడు.
మనతో పాటుగా పాకిస్తాన్ కు కూడా ఇండిపెండెన్స్ వచ్చిందిని ఇలా రిషీ కపూర్ తన పద్దతిలో చెప్పిన అది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రిషీ కపూర్ కొన్ని గంటలు కిందట మన దేశప్రజలకు స్వాతంత్రదినం శుభాకాంక్షలు చెబుతూ “ నా దేశం చాలా గొప్పది 70 వ పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేశానికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. వందేమాతరం జై హింద్” అని చెప్పారు.