Begin typing your search above and press return to search.
ఈ రోజు ఆయన..రేపు నేను చచ్చినా అంతే!
By: Tupaki Desk | 28 April 2017 8:18 AM GMTబాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రిషీకపూర్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అంత్యక్రియలకు ఈతరం కుర్రహీరోలు ఎవరూ రాకపోవటంపై రిషీకపూర్ ఫైర్ అయ్యారు. ఒక గొప్ప నటుడికి కనీస గౌరవం ఇవ్వకపోవటం సిగ్గుచేటన్న ఆయన.. నేటితరం స్టార్లపై ఆయన ఫైర్ అయ్యారు.
ఒక సీనియర్ నటుడు చనిపోతే.. ఆయన అంత్యక్రియలకు ఈ తరానికి చెందిన ఒక్క కుర్ర నటుడు కూడా రాకపోవటం సిగ్గుచేటన్న రిషీకపూర్.. "వినోద్ ఖన్నాతో కొందరు యువ నటులు నటించారు కూడా. పెద్దవాళ్లకు కనీసం గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి" అంటూ అసహనం వ్యక్తం చేశారు. తన ఆవేదనను మరిన్ని ట్వీట్లలో పంచుతూ.. రేపు తాను చనిపోయినప్పుడు కూడా తనను భుజాన మోసేందుకు ఎవరూ ఉండరని.. అందుకు తాను ప్రిపేర్ కావాలంటూ మండిపడ్డారు.
అయితే.. వినోద్ ఖన్నా అంత్యక్రియలకు రిషీకపూర్ కుమారుడు రణబీర్ కపూర్.. భార్య నీతూకపూర్ హాజరుకాకపోవటాన్ని ప్రస్తావిస్తూ.. తన భార్య.. కుమారుడు ఇద్దరూ విదేశాల్లో ఉన్నారని అందుకే రాలేకపోయారన్నారు. ఏమైనా.. రిషీకపూర్ ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/